వైయ‌స్ జ‌గన్ కొత్త ఇంపోర్ట్ కారు ధ‌ర, ప్యూచ‌ర్స్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

490

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గన్మోహ‌న్ రెడ్డి.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇప్పుడు ఓ ప్ర‌భంజ‌న నేత అనే చెప్పాలి.. దివంగ‌త నేత మాజీ సీఎం వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుమారుడిగా పొలిటిక‌ల్ గా అరంగేట్రం చేసిన జ‌గ‌న్, ప్ర‌స్తుతం ఏపీలో పాద‌యాత్ర‌లో ఉన్నారు.. ఆయన పాలిటిక్స్ లోకి రాక‌ముందు వ్యాపారాలు చేసేవారు.. సిమెంట్ ఎన‌ర్జీ మీడియా ఇలా ప‌లు రంగాల‌లో ఆయ‌న బిజినెస్ చేసేవారు. వైయ‌స్ ఫ్యామిలీలో అతి చిన్న వ‌య‌సులోనే ఆయ‌న వ్యాపారాలు మొద‌లుపెట్టారు. ఇక ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత వ్యాపారాలు అన్నీ ఆయన భార్య‌భార‌తి చూసుకుంటున్నారు..వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్ట ప్రారంభించ‌క‌ముందు జ‌గ‌న్ స్కార్పియో వాహ‌నాన్ని మాత్ర‌మే వాడేవారు.. ఇది చాలా దృడంగా ఉండేది. త‌ర్వాత కొద్ది రోజులు జ‌గ‌న్ స్కార్పియో వాహ‌నాన్ని వాడారు. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌భుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం విష‌యంలో అనేక సార్లు అర్జీ పెట్టుకున్నా కొత్త వాహ‌నం ఇవ్వ‌లేదు అనే విమ‌ర్శ‌లు వైసీపీ నుంచి వినిపిస్తూనే ఉన్నాయి.

ఇక ఆయన తాజాగా జాగ్వార్ కారుని ఉప‌యోగిస్తున్నారు అని తెలుస్తోంది…జాగ్వార్ ఎక్స్ జే ఎల్ ల‌గ్జ‌రీ సెడాన్ కారుని జ‌గన్ వాడుతున్నారు అని తెలుస్తోంది.. లండన్ లో త‌యారు అయిన ఈ కారు రెండు కోట్ల 50 ల‌క్ష‌ల రూపాయ‌లు ఉంటుంది అని తెలుస్తోంది.. ఈ కారులో ఆయ‌న‌కు త‌గిన విధంగా కొన్ని మార్పులు చేయించారట‌.. దీని ఇంజ‌న్ చాలా నాణ్య‌మైన లోహంతో త‌యారు అయింది….ఇది వీ6 ట‌ర్బో ఛార్జ్ ఇంజ‌న్, 8స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్ మిష‌న్ అందిస్తుంది… ఇది 6.2 సెక‌న్ల‌లో 100 కిలోమీట‌ర్ల స్పీడు అందుకుంటుంది… ఈ కారు గంట‌కు 250 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది.

ఇందులో వెల్డింగ్ జాయింట్ ఉండ‌దు..దీనిని అల్యూమినియం మోనోకాక్ జాస్ పై త‌యారు చేశారు…ఇందులో ప్ర‌తి భాగం రివిట్ మెంట్ ప‌ద్ద‌తిలో చేశారు.. ఈ కారులోప‌ల ఇంటిరియ‌ర్ చూస్తే ఫైవ్ స్టార్ హూట‌ల్ లో డీల‌క్స్ రూమ్ ని పోలిన‌ట్టు ఉంటుంది… దీనిని చూస్తే రిచ్ లుక్ భావ‌న క‌లుగుతుంది. కంప్యూట‌రైజ్ట్ సిస్టం తో ఎల్ ఈడీ స్క్రీన్లు కారు సీట్ల‌కు ఉంటాయి. ప్ర‌స్తుతం ఈ కారునే జ‌గ‌న్ వాడుతున్నారు అని తెలుస్తోంది.