Breaking News:కంట్రీ ఫుడ్ మస్తానమ్మా ఇక లేరు..శోక సంద్రంలో కుటుంబం

420

ఆమె చేతి వంటలు రుచి చూస్తే అలనాటి నల భీములకులైన అసూయా పుట్టాల్సిందే. ఆమె వంట చేసే విధానం చుస్తే సీనియర్ వంట మాస్టర్స్ కైనా దిమ్మతిరగాల్సిందే. ఆ వయస్సు వారంతా కృష్ణ రామ అంటూ ఒక మూల కూర్చుంటే ఆమె మాత్రం కోట్లు గడిస్తోంది. ఆలా అని ఆమెకు 60 ఏళ్ళు కాదు 106 ఏళ్ళు. ఈ వయస్సులో ఆమె చేస్తున కృషి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.ఆమె ఎవరో మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.ఆమెనే మస్తానమ్మా.ఈమెకు యూట్యూబ్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.అయితే ఈమె ఇప్పుడు మన అందరికి వదిలివెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లాలోని గుడివాడ ఆ గ్రామానికి శివారున మస్తానమ్మ ఒంటరిగా జీవిస్తుంటుంది. ఆమెకి 106 ఏళ్ళు ఇప్పటికి కస్టపడి పనిచేస్తుంటుంది. కొడుకులు, కోడలు, కూతరులు, మనవళ్ళు , మనవరాళ్లు, అందరు ఉన్న వారితో కలిసి ఉండడం మస్తానమ్మకు ఇష్టం ఉండదు. ఆలా అని వారి మీద కోపం కాదు వారి మీద ఆధారపడి బ్రతకడం ఇష్టంలేక దూరంగా ఒంటరిగా ఉంటుంది. 106 ఏళ్ళ వయస్సులో కూడా ఆమె చేతి నిండా ఏదో ఒక పని పెట్టుకొంటుంది. ఆ పని చలాకీగా చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంటుంది. ఆమె ఉండేది పురే గుడిసెలో. ఆ గుడిసెకి కనీసం తలుపులు కూడా లేవు కానీ ఇప్పుడు మస్తానమ్మ ఓల్డ్ ఏజ్ యూట్యూబ్ స్టార్ గా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగింది.. ఆమె పేరు తెలీని వారు లేరు. ఆమె వంట చేసే విధానం చూసి ఆమె చేతి వంటను ఒక్కసారి అయిన రుచి చూడాలి అని ఆరాటపడిన వారు లక్షల్లో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఒక యూట్యూబ్ ఛానల్లో మస్తానమ్మ చేసే వంటల వీడియోకు మంచి వ్యూస్ వస్తుంటాయి.

పెద్దగా కిచెన్ సెట్ అప్ ఉండదు పెద్దగా వంట సామాగ్రి ఉండదు కానీ ఆమె వంటలు చేసే విధానం బహు గమ్మత్తుగా ఉంటాయి. ఒక గట్టు మీద మాములు కట్టెలు పోయి రాజేసి మస్తానమ్మ వంటలు చేసే విధానం చూస్తే కాకలు తీరిన మగాళ్లు చూస్తే ఔరా అనాల్సిందే..ఆమె వంటల వీడియోకు రెండున్నర లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు అంటే మీరే అర్థం చేసుకోండి మస్తానమ్మ మజాకా. ఈ వంటల ఛానల్ ఐడియా మస్తానమ్మ మనవడికి వచ్చింది ఆ ఆలోచన రాగానే బామ్మా గుర్తొచ్చింది. తనతో వంటలు చేయించి షూట్ చేసి అప్ లోడ్ చేస్తే ఎలా ఉంటుందా అని అలోచించి ఈ వీడియోలు స్టార్ట్ చేసాడు. ఆమె వంటల వీడియోకు వచ్చిన రెస్పాన్స్ చూసి BBC సైతం ఆశ్చర్యపోయింది. ఆమె దగ్గరకి వచ్చి మరి ఆమె తయారు చేసే వంటలు షూట్ చేయడంతో పాటు ఆమె చేసిన వంటలు రుచి కూడా చేశారు. ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆమె వంటల తయారీని BBC లో చూపించారు. అయితే వయసు ఎక్కువ ఉండడంతో ఆమె హఠాత్తుగా కన్నుమూసింది.ఆమె మరణించడంతో అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.ఆమె అంత్యక్రియలు గుడివాడలో ఘనంగా నిర్వహించారు.