నా భార్య అంటే నా భార్య అంటూ గొడవపడ్డ యువకులు.. చివరికి?

595

ప్రస్తుతం దేశంలో అక్కడక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు వింటుంటే నిజంగా కొంత ఆశ్చర్యం వేయకమానదు అనే చెప్పుకోవాలి.అవి వింటే ఒకవైపు ఆశ్చర్యకరంగా ఉంటాయి.మరొకవైపు కొంచెం నవ్వు తెప్పిస్తాయి.మనం ఒక అమ్మాయి కోసం కొట్టుకున్న ప్రేమికులను చూసి ఉంటాం.నా లవర్ అంటే నా లవర్ అంటూ అబ్బాయిలు గొడవ పడతారు.కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో ఇద్దరు వ్యక్తులు నా భార్య అంటే నా భార్య అంటూ గొడవపడుతున్నారు.కానీ ఆమె వీరిద్దరిలో ఎవరి భార్య కాదు.మరి వారిద్దరూ ఎందుకు అలా గొడవపడుతున్నారో,వాళ్ళ కథ ఏమిటో తెలుసుకుందామా.

Image result for mens fighting india

కర్ణాటక రాష్టం చిక్కబిదరకల్లులో నివాసముండే మూర్తి, సిద్దు అనే ఇద్దరు వ్యక్తులు నేలమంగళ తాలూకా బావికెరె క్రాస్ రోడ్డు వద్ద అటువైపుగా వెళ్తున్న ఒక మహిళను ఆపారు.అయితే ఎందుకు ఆగమన్నారో అని ఆమె ఆగింది.ఆమె ఆగడం ఆలస్యం వీళ్ళిద్దరూ గొడవకు దిగారు.ఆమె ముందే ఒకరిని ఒక కొట్టుకున్నారు.ఆమె నా భార్య అని ఒకరు అంటే, కాదు కాదు నా భార్య అంటూ మరొకరు అరుచుకుంటూ కొట్టుకున్నారు.ఆ గొడవ తీవ్రం అయ్యింది.ఒకరిపై మరొకరు కలబడి పిడిగుద్దులు గుప్పించుకున్నారు.ఆమె మాత్రం వాళ్ళను అలా చూస్తూ ఉండిపోయింది.వారి గొడవతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా జనసంద్రంతో నిండిపోయింది.

Image result for mens fighting india

చుట్టుప్రక్కలివారు వారిని విడిపించకపోగా వీడియోలు మరియు ఫోటోలు తీయసాగారు. అయితే వారిలో కొందరు ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా అది ప్రస్తుతం వైరల్ గా మరి చక్కర్లు కొడుతోంది.అయితే ఈ వీడియో చూస్తే వాళ్ళిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారని అర్థం అయ్యింది.అయితే ఆ మహిళా గురించి మీకొక విషయం చెప్పాలి.ఆమెకు ఆల్రెడీ పెళ్లి జరిగింది.కానీ భర్త నుండి విడాకులు తీసుకుని విడిగా జీవిస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒంటరిగా ఉన్న ఆమెను సిద్దు మరియు మూర్తి నేను చేసుకుంటునటు అనే నేను చేసుకుంటాను అంటూ ఇలా గొడవకి దిగడంతో ఇక చివరికి మహిళ సహా స్థానికులు కూడా షాక్ అయ్యారు.పెళ్లి కానీ అమ్మాయి కోసం కొట్టుకోవడం చూశాం కాని ఇలా పెళ్లై విడాకులు తీసుకున్న మహిళా కోసం కొట్టుకోవడం ఇదే మొదటిసారి కదా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.పెళ్ళైన ఈమె కోసం ఇలా కొట్టుకున్న ఈ వ్యక్తుల గురించి అలాగే అమ్మాయి కోసం పిచ్చోళ్ళ లాగా పీకులాడే కుర్రకారు గురించి మీ అభిప్రాయలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.