మీ జీవితం మొత్తం లో ఒక్కసారి ఈమె పేరు తలచుకుంటే ఎంత పెద్ద పాపము చేసి ఉన్నా పోతుంది

907

రావణాసురు పేరు వినగానే సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిన రాక్షసుడు గుర్తుకు వస్తాడు.కానీ ఆ రాక్షసుడి భార్య మండోదరి పేరు తలచుకోగానే మన పాపాలు అన్ని పోతాయంట.ఎందుకంటే ఆమె అంత పతివ్రత అని పురాణాలూ చెబుతున్నాయి.మరి అలంటి పతివ్రత రావణాసురుడు లాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంది.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for mandodari ramayan

మండోదరి’ రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు. దైవాంశయైన మండోదరి మయుని పుత్రిక. తల్లి హేమ అనబడే దేవకన్య. ఈమె తన తండ్రితో కలిసి వనంలో సంచరించే వేళ వేటకై రావణుడు వెళ్లినప్పుడు ఈమెను చూస్తాడు. తాను అవివాహితుణ్ణి కాబట్టి తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని రావణుడు కోరుకుంటాడు.మయుడు మండోదరిని రావణునికిచ్చి వివాహం జరిపించాడు.

Image result for mandodari ramayan

అందుచే ఈమె రావణాసురుని పట్టమహిషి. మిక్కిలి సౌందర్యం గలది. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమే గాదు మండోదరి అంతస్సౌందర్యం మిక్కిలి కొనియాడదగినది. మండోదరి అంటే రావణ బ్రహ్మ సతీమణిగా తెలుసు. ఆమె పేరు తలచుకుంటే చాలు పాపాలు హరించ బడతాయని పురాణాలు చెబుతున్నాయి. మండోదరి రావణుని భార్యనే కాదు. ఆమె మయుడనే గొప్ప నిర్మాణ శిల్పి కుమార్తె. మండోదరి అంటే మండనం యస్యస ఉదరం. అంటే సన్నని నడుము గలది అని అర్ధం. తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్ట కలది. భూమి వంటి ఉదరము అంటే సంతాన సాఫల్యత గల ఉదరము అని అర్థం.

మండోదరి అహల్య, తార, సీత, ద్రౌపదితో కలిసి పంచ కన్యగా ప్రసిద్ధి చెందింది. విచిత్ర మేమిటంటే, ఈ అయిదుగురు స్త్రీలు తమ భర్తలతో ఏదో విధంగా సంబంధాలు చెడిన వారే. అహల్యని గౌతమ ఋషి వెళ్ళగొట్టాడు.పర పురుష సంబంధం ఉందన్న కారణంగా.తార తన భర్త వాలి చనిపోయిన తరువాత అతని సోదరుడైన సుగ్రీవుడిని వివాహమాడింది, సీత చెప్పుడు మాటలు విన్న రాముడి చేత వెళ్ళ గొట్టబడింది, ఇక ద్రౌపది అయిదుగురు భర్తలు ఆమెను జూదంలో ఒడ్డి పోగొట్టుకున్నారు. అయితే మండోదరి మాత్రం ఒక అసురుని భార్యగా మాత్రమే తెలుసు.మండోదరి గురించి అనేక పురాణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అందులో ఒకటి మండోదరికి జన్మించిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణ హాని ఉందని జోస్యం చెప్పింది. ఒక రోజు ఆమె ఒక కుండలో నీరనుకుని రక్తం తాగుతుంది. ఆ రక్తం రావణుడు వధించిన రుషులది.ఆ కారణంగా ఆమె గర్భం ధరించి, ఒక కుమార్తెకు జన్మనిస్తుంది. జోస్యం తెలిసిన భర్త తన బిడ్డని బతకనివ్వడని, ఆమెను ఒక పెట్టెలో పెట్టి, సముద్రంలో విడిచిపెడుతుంది. సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు. భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది. ఆ పాపే సీత. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి, రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది.ఇది మండోదరి కథ.మరి మండోదరి గురించి ఆమె పతివ్రత తనం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

బిజెపికి మరో షాక్…మరో కేంద్ర మంత్రి గుడ్ బై