విమానం డోర్ తెరిచి.. 3500 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన యువతి, శవం మాయం!

97

మీరెప్పుడైనా విమాన ప్రయాణం చేశారా.. చాలా మంది చేసే ఉంటారులే. ఆకాశం లో విమాన ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది…సరదాగా ఆకాశం లో విహరించి రావాలనే కోరిక చాల మందికే ఉంటుంది….కానీ అపుడపుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఈ మధ్య మనం ఎక్కువగా విమాన ప్రయాణ వార్తల గురించి వింటున్నాం. మొన్నామధ్య ఒక వ్యక్తి గాలిలో ఉనన్ విమానంలో సిగరెట్ తాగాడని విన్నాం. ఆ తర్వాత ఒక మహిళ ఉక్కపోస్తుందని బట్టలు విప్పేసిన ఘటన గురించి విన్నాం. ఇలాంటి ఘటనల వలన విమాన ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మరొక ఘటన జరిగింది. విమానం 3500 ఎత్తులో ఉండగా ఓ యువతీ దూకేసింది. మరి చివరికి ఏమైందో ఇప్పుడు చూద్దాం.

Image result for man flying above the flight

సెస్నా లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణిస్తున్న ఓ యువతి అకస్మాత్తుగా విమానం డోరు తెరిచి దూకేసింది. ఆ సమయంలో విమానం 3500 అడుగుల ఎత్తులో ఉంది. దీంతో ఆమె చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ విద్యార్థి అలానా కట్లాండ్ (19).. అరుదైన పీతల జాతులపై అధ్యయనం కోసం తూర్పు ఆఫ్రికాకు బయల్దేరింది. యానిమల్ బయాలజీ ప్రాజెక్టులో భాగంగా మూడు వారాలపాటు అన్జాజవీ లాడ్జ్‌లో ఉండి అధ్యయనం చేయాలని భావించిన ఆమె.. తన పర్యటనను 8 రోజులకే ముగించాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా జులై 25న మడగాస్కర్‌కు వెళ్లేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్కింది. ఆమెతోపాటు రుత్ జాన్సన్ అనే వ్యక్తి కూడా ఆ విమానం ఎక్కాడు. విమానం బయల్దేరిన 10 నిమిషాల తర్వాత ఆమె సీట్ బెల్ట్ తీసేసి.. కుడి వైపు ఉన్న విమానం డోర్‌ తెరిచింది. అనంతరం దూకేందుకు ప్రయత్నించగా జాన్సన్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. పైలట్ కూడా ఒక చేత్తో ఆమె కాలును పట్టుకుని, మరో చేతితో విమానం నడిపాడు. సుమారు 5 నిమిషాల పెనుగులాట తర్వాత ఆమె ఇద్దరినీ వదిలించుకుని విమానం నుంచి దూకేసింది. సుమారు 3500 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది.

ఈ క్రింద వీడియో చూడండి

అనలాలవా ప్రాంతంలోని సవన్నా నదీ పరివాహక ప్రాంతంలో ఆమె పడి ఉండవచ్చని పైలట్ తెలిపాడు. అయితే, ఆ ప్రాంతానికి వెళ్లడం చాలా కష్టమని, అక్కడ జనసంచారమే ఉండదని అధికారులు తెలుపుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రమాదకర జంతువులు జీవిస్తున్నాయన్నారు. ఒక వేళ ఆమె అంత ఎత్తు నుంచి పడి ప్రాణాలతో ఉన్నా.. అవి చంపేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రమాదం తర్వాత పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా ఆమె ఆచూకీ లభించలేదు. అలానా కట్లాండ్ పారనోయా అటాక్స్‌తో బాధపడుతున్నట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. అది ఒక మానసిక సమస్య అని, ఆ సందర్భంలో వారు కుంగుబాటుకు గురై ప్రాణాలు తీసుకోడానికి ప్రయత్నిస్తారన్నారు. ఇదివరకు కూడా ఆమె ఈ సమస్యతో బాధపడిందని తెలిపారు. ఆమె చేపట్టిన ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోవడంతో ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా సూసైడ్ చేసుకోవడం తప్పే. మరి ఈ ఘటన గురించి అలాగే ఈ మధ్య ఎక్కువగా చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదకరపు ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.