మీకు ఆధార్ కార్డు లేదా కేంద్రం షాకింగ్ న్యూస్ తప్పక తెలుసుకోండి

522

మ‌న‌కు పాస్ పోర్ట్ లా ఇప్పుడు ఆధార్ కార్డ్ అన్నింటికి ఒక‌టే కార్డుగా మారిపోయింది ఆధార్ లేక‌పోతే సంక్షేమ ప‌థ‌కాల‌కు కూడా అన‌ర్హులుగా చెబుతున్నారు అధికారులు అందుకే పుట్టిన వారి నుంచి ముస‌ల‌వివారి వ‌ర‌కూ దేశంలో అంద‌రికి ఐడెంటిటీ అంటే ఆధార్ ఒక్క‌టే అయింది.ఆధార్‌ కార్డులో ఎటువంటి మార్పులుచేర్పులు చేసినా.. కొద్ది రోజుల తర్వాత మీసేవా కేంద్రాలకో, ఆధార్‌ కేంద్రాలకో వెళ్లి మనమే డౌన్‌లోడ్‌ చేసుకుంటాం. ఇవి కొంత నాసిరకంగా, మునుపటి వాటితో పోల్చితే చాలా పల్చగా ఉంటాయి. అయితే ఇక నుంచి ఆధార్‌ ‘ఒరిజినల్‌’ కార్డులను నేరుగా విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నుంచే పొందవచ్చు. ఆధార్‌కార్డు ప్రవేశపెట్టిన తొలినాళ్లలో పోస్టులో ఇంటికి పెద్ద కార్డులు వచ్చేవి. గుర్తుంది కదా! ఇప్పుడూ అలానే వస్తాయన్నమాట. పైలట్‌ ప్రాజెక్టుగా యూఐడీఏఐ దీనిని మళ్లీ చేపట్టింది. ఆధార్‌ కేంద్రాలు, మీసేవా కేంద్రాల్లో తీసుకున్న కార్డులుచెల్లుబాటు అయినా.. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికితోడు.. ‘ఒరిజినల్‌’కు డిమాండ్‌ అధికంగా ఉందని యూఐడీఏఐ అధికారి ఒకరు తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఎలా దరఖాస్తు చేయాలంటే..
resident.uidai.gov.in/aadhaarreprint వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.తర్వాత అక్షరాలు, అంకెలు గల సెక్యూరిటీ కోడ్‌(కేప్చా)ను ఎంటర్‌ చేయాలి.మీకు ‘ఎంఆధార్‌’ యాప్‌ ఉంటే.. అందులో ‘i have totp’ బాక్స్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి.టీవోటీపీ లేకపోతే ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ఓటీపీ’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.ఆధార్‌తో రిజిస్టర్‌ అయిన నంబరుకు వచ్చిన ఓటీపీని సంబంధిత బాక్సులో ఎంటర్‌ చేసి సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.తర్వాత రూ.50 కట్టాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డును మీ అడ్రస్‌కు యూఐడీఏఐ పోస్టులో పంపుతుంది.మ‌రి చూశారుగా ఇక మీసేవా కేంద్రాల ద‌గ్గ‌ర క్యూ ల‌కంటే ఇలా ఇంట్లోనే మీరు ఆన్ లైన్ లో ఆధార్ ని క్లిక్ చేసి పోస్టులో ఇంటికి పొంద‌చ్చు, మ‌రి ఈ అవ‌కాశం మీ స‌న్నిహితుల‌కు కూడా తెలియ‌చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.