పాప్ కార్న్ తింటున్నారా ఈ విషయం తెలిస్తే కచ్చితంగా షాకవుతారు

392

మ‌నం సినిమా ధియేట‌ర్ కు వెళ్లాము అంటే ఠ‌క్కున తినాలి అని పించే ఐటెం పాప్ కార్న్.. పాప్ కార్న్ అంటే ఇష్టం లేని వారు ఎవ‌రు ఉంటారు చెప్పండి.. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌రకూ అంద‌రికి పాప్ కార్న్ ఇష్ట‌మే.. ముఖ్యంగా ఆరోగ్యానికి కూడా మంచిద‌ని పీచు ప‌దార్ధం అని ఎక్కువ శాతం ఇవి తిన‌డానికి కూడా డైట్ ఫాలో అయ్యేవారు ఇష్ట‌ప‌డ‌తారు.. ఇలా తినే పాప్ కార్న్ గురించి మీకు తెలియని కొన్ని విష‌యాలు ఈరోజు తెలుసుకుందాం .

Image result for popcorn

కొవ్వు తక్కువ పీచు ఎక్కువగా ఉండే పాప్ కార్న్ లో పండ్లలో కంటే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తెలిసింది. పాప్ కార్న్ లో ఉండే పాలీ ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యర్ధాలతో పోరాటం చేసి అనారోగ్యం కలగకుండా కాపాడతాయి. అంతేకాకుండా రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

Image result for popcorn

మనం ఒక్కసారి తినే పాప్ కార్న్ లో 300 ఎంజి పాలీఫెనాల్ ఉంటుంది. పాప్ కార్న్ పైన ఉండే పొట్టు కూడా తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనం సాధారణంగా తినే అన్ని రకాల స్నాక్స్ లలో పాప్ కార్న్ చాలా మంచి ఆహారం. ఇది నూటికి నూరు శాతం గింజధాన్యాల ఆహారం. పాప్ కార్న్ ప్రాసెస్ చేసిన ఆహారం కాదు కాబట్టి ప్రతి రోజు పాప్ కార్న్ తిన్నా ఎటువంటి ఇబ్బందులు రావు. ఇక పాప్ కార్న్ ని అతిగా తిన్నా ఎటువంటి స‌మ‌స్య ఉండ‌దు, కాని అడిక్ట్ అవ్వ‌డం అంత మంచిది కాదు, అందుకే దీనిని సినిమా చూడ‌టానికి వెళ్లిన స‌మ‌యంలో పార్క్ లు అలాగే రిలాక్స్ అయిన స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే పాప్ కార్న్ తయారు చేసినప్పుడు నూనె,వెన్న,ఉప్పు,పంచదార వంటివి చేర్చకూడదు. ఒకవేళ చేరిస్తే కాస్త ఆరోగ్యానికి హానికరమే అని చెప్పాలి. పాప్ కార్న్ తినటం వలన కేలరీలు తక్కువ ఉండటం మరియు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన బరువు తగ్గేవారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు… అలాగే పాప్ కార్న్ లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండటం వలన అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. పిల్ల‌లు కూడా ఇవి తిన‌డం మంచిది.. చూశారుగా పాప్ కార్న్ ఉప‌యోగాలు ప‌ది మందికి తెలిసేలా షేర్ చేయండి.. ఒక‌వేళ పాప్ కార్న్ తినే అల‌వాటు లేక‌పోతే ఇప్ప‌టి నుంచి అయినా ఈ మంచి ఫుడ్ తిన‌డం అల‌వాడు చేసుకోండి.