ఇలాంటి వీడియో మీరు ఇంత వరకు ఎప్పుడు చూసి ఉండరు

677

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు.అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకొచ్చారు.మాసాబ్ ట్యాంక్ లో ఉన్న హరికృష్ణ ఇంటికి మృతదేహం చేరింది.ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హరికృష్ణ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.ఇక తర్వాతి కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు.అయితే హరికృష్ణ నెల్లూర్ లో ఒక పెళ్ళికి వెళ్తూ చనిపోయాడని మన అందరికి తెలిసినదే.అయితే మరి ఆ పెళ్లి జరిగిందా..ఒకవేళ జరిగితే ఎలా జరిగింది.ఆ విషయాల గురించి తెలుసుకుందామా.

హరిక‌ృష్ణ మృతితో ఆయన వెళ్ళాల్సిన పెళ్లి మండపంలో విషాదం అలుముకుంది.తన స్నేహితుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారని తెలిసి ఆయన మిత్రుడు మోహన్‌ దిగ్ర్భాంతికి గురయ్యారు.వచ్చి మాతో ఆనందంగా గడుపుతావనుకున్నా కానీ ఇలా మమ్మల్ని వదిలేసి పోతావని అనుకోలేదని ఆయన మిత్రుడు మోహన్ కన్నీటి పర్యంత అయ్యాడు.తన కుమారుడి పెళ్లికి వస్తాడనుకున్న హరికృష్ణ ఆకస్మిక మరణవార్త విని భోరున విలపించారు. దీంతో నెల్లూరు జిల్లా కావలిలోని బృందావన్‌ కళ్యాణమండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పెళ్లి ఆపెయలన్నా నిర్ణయానికి కూడా వచ్చారు.కానీ పెళ్లి ఆపడం మంచిది కాదని పంతులు చెప్పడంతో మోహన్ వెనుకడుగు వేశాడు.దాంతో పెళ్లి జరిగిపోయింది.పెళ్లి జరుగుతున్న ఆనందం ఎవ్వరి కళ్ళలో లేదు.అందరి మొహాలు విశాదచాయలలో ఉన్నాయి.ఒక్కరి ముఖం మీద కూడా నవ్వు లేదు.అక్కడ పెళ్లి జరుగుతుందా లేదా ఇంకా ఏమైనా చెడు కార్యక్రమం జరుగుతుందా అన్న పరిస్థితిలో పెళ్లి జరిగింది.

అయితే పెళ్లి జరిగిన తర్వాత ఆ పెళ్ళికొడుకు చేసిన పని ఇప్పుడు అందరి మెప్పు పొందేలా చేస్తుంది.నందమూరి హరికృష్ణ ఒక పెద్ద ఫోటోను తీసుకొచ్చి హరికృష్ణ ఆశీర్వాదం తీసుకున్నారు.అంకుల్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తారనుకున్నాం కానీ ఈ అనంతలోకలను వదిలివెళ్లారు.మీ మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం.కానీ తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాం.మీరు ఈ పెళ్ళికి రాకున్నా సరే మీ దీవెనలు మాకు కావలి అని హరికృష్ణ దీవెనలు తీసుకున్నారు.పెళ్లి కోడుకు చేసిన ఈ పనిని అందరు మెచ్చుకున్నారు.ఆయన ఎక్కడ ఉన్నా మిమ్మల్ని ఆశీర్వదిస్తునే ఉంటారని పెళ్ళికి వచ్చిన గెస్ట్ లు చెప్పారు.