ఈ వింతను మీ కళ్ళతో చూస్తే గాని నమ్మలేరు

537

ఈ మద్య ప్రపంచంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగే ప్రతీ వింత ఇట్టే వైరల్ అవుతుంది. అప్పుడప్పుడు వింత శిశువుల జననం గురించి వింటున్నాం..విచిత్రమైన అవయవాలతో ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేసేలా వారు జన్మిస్తారు.వారిని ఇంటర్ నెట్ లో చూడటమే కానీ నిజంగా చూసింది లేదు. అయితే జనకన్యలా గురించి మనకు తెలుసు. అవి సముద్రంలో ఉంటాయని మనకు తెలుసు.అయితే అలంటి జీవి మనిషికి పుట్టే అవకాశం ఉందా అంటే లేదనే అంటారు. కానీ ఇక్కడ ఒక మహిళా జలకన్యకు జన్మించింది. ఆశ్చర్యపోతున్నారా కానీ ఇది నిజం. మరి ఆ జలకన్య గురించి తెలుసుకుందామా.

Image result for jalakanya

మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతంలో మత్స్యకన్య లక్షణాలతో జన్మించిన ఓ బిడ్డ, 15 నిమిషాల తరువాత మరణించింది. ఓ పాప అత్యంత అరుదైన సెరినోమిలియా (దీన్నే మర్ మెయిడ్ సిండ్రోమ్ గా కూడా పిలుస్తారు) లక్షణాలతో జన్మించిందని వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.ఆమె కాళ్లు అతుకుపోయి ఉన్నాయని అంబజోగాయ్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ ప్రభుత్వ వైద్యశాల గైనకాలజిస్టు డాక్టర్ సంజయ్ బన్సోడే వెల్లడించారు. సాధారణంగా మనం కథల్లో వింటుంటాం.. మత్సకన్యల గురించి..ఇప్పుడు ఆ చిన్నారి మత్సకన్యలా జన్మించడంపై అందరూ ఆశ్చర్యపోయారు.ఇక సెరినోమిలియా వ్యాధి, బిడ్డ గర్భంలో పెరిగే సమయంలో దిగువ వెన్నెముక ఎదుగుదల లోపం కారణంగా వస్తుందని ఆయన తెలిపారు. ఆమె తల్లి దీక్షా కాంబ్లీని సోమవారం ఉదయం 7 గంటల సమయంలో కాన్పు నిమిత్తం తీసుకు వచ్చారని, ఆపై ఆమె 1.8 కిలోల బరువున్న బిడ్డను కందని, ఆ బిడ్డ పుట్టిన 15 నిమిషాల తరువాత మరణించిందని, తల్లి క్షేమమేనని తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలాగె 1993 లో ఒక పాప జన్మించింది. సిండ్రోమ్ కారణంగానే ఆమె కాళ్ళు అతుక్కుని పుట్టింది. ఆ పాపకు ఆపరేషన్ చేపించి కాళ్ళను విడదీశారు. ఈ సిండ్రోమ్ వచ్చి బతికిన వారిలో పెరుకు చెందిన ఒక పాప కూడా ఉంది.దీని గురించి డాక్టర్ సుదీప్ సాహా మాట్లాడుతూ… ఇలాంటి కేసు చూడట భారతదేశంలో రెండవసారి. ప్రపంచవ్యాప్తంగా ఐదవ కేసు.దురదృష్టవశాత్తు పుట్టిన పాప నాలుగు గంటలు మాత్రమే జీవించింది. ఇంతకు ముందు అలాంటి శిశువు నేను ఎన్నడూ చూడలేదు, రాష్ట్రంలో సైరేనోమెలియా యొక్క మొట్టమొదటి కేసు మరియు దేశంలో రెండవది. శరీర పై భాగంలో సాధారణ నిర్మాణాన్ని కలిగి ఉండేది, కానీ నడుము క్రింద దాని కాళ్ళు కలిసి పోయాయి. దిగువ భాగం పూర్తిగా అభివృద్ధి కాలేదని ఆయన అన్నాడు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. జలకన్యలా పుట్టిన ఈ పాప గురించి అలాగే దీనికి కారణమైన సిండ్రోమ్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.