74 ఏళ్ల ‘తల్లి బామ్మ’కు సీరియస్.. ఐసీయూలో..!

1732

మహిళ ఎన్ని సాధించినా మాతృత్వం పొందలేకపోతే అదో పెద్ద వెలితిగానే ఉండిపోతుంది. అమ్మ అయినప్పుడే అమ్మాయికి పరిపూర్ణత అంటారు. అందుకే ఈ మధ్య ఒక బామ్మ 74 ఏళ్ల వయసులో తల్లి అయి రికార్డు సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు ఐవీఎప్ విధానంలో సంతాన భాగ్యం కలిగింది. వీరికి 1962లో వివాహం కాగా, ఏళ్ల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా పిల్లలు కలగలేదు. వయసు మీదపడినా మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలని కోరిక బలంగా ఉండేది. వారికి తెలిసిన ఓ మహిళ 55 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంలో బిడ్డకు జన్మనివ్వడంతో మంగాయమ్మలో ఆశలు చిగురించాయి. గతేడాది నవంబర్‌లో గుంటూరులోని అహల్య హాస్పిట‌ల్‌ను సంప్రదించారు. ఐవీఎఫ్‌ నిపుణులైన డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌ మంగాయమ్మన పరీక్షించారు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో ఐవీఎఫ్ విధానం చికిత్స ప్రారంభించారు. మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని, మరో మహిళ నుంచి అండాన్ని తీసుకొని ఐవీఎఫ్ విధానంలో పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టారు. గర్భం దాల్చిన మంగాయమ్మను వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు.

ఈ క్రింద వీడియో చూడండి

సెప్టెంబరు 5న మంగాయ్మకు శస్త్రచికిత్స నిర్వహించగా, కవలలకు జన్మనిచ్చింది. దీంతో ఆ ముసలి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్‌ ద్వారా ఆమెకు ఇటీవలే కాన్పు చేశారు డాక్టర్లు. ఆమె అప్పట్లో క్షేమంగా ఉన్నట్టు కూడా డాక్టర్లు తెలిపారు. ఇప్పుడు వీరి గురించి మళ్లీ ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే.. ఈ వయసులో బిడ్డకు జన్మనిచ్చిన తాలూకూ ఆరోగ్య సంబంధమైన సమస్యలు రావడంతో మంగాయమ్మ అనే ఈ బామ్మ మళ్లీ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటోంది. ఇక. ఆమె భర్త ఎర్రమట్టి రాజారావుకు కూడా హార్ట్‌ఎటాక్‌తో ఆస్పత్రిలో చేరారు. దీంతో వీరి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కవలపిల్లల పుట్టుక సందర్భంగా మంగాయమ్మ దాదాపు మూడు గంటలపాటు తీవ్రమైన నొప్పులు అనుభవించిందని, దీంతో ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందించవలసి వచ్చిందని ఉమాశంకర్ అనే డాక్టర్ తెలిపారు. ఇక తన భర్త రాజారావు పరిస్థితి ఇంక సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. హఠాత్తుగా తన భార్య అనారోగ్యానికి గురి కావడంతో ఆయన తట్టుకోలేక గుండెపోటుకు గురైనట్టు డాక్టర్లు తెలిపారు. లేటు వయసులో పండంటి కవలలకు తల్లిదండ్రులైన వీరి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉండటం విచారకరం.

Worlds oldest Mother and her Husband in Intensive Care unit

అయితే ఈ బామ్మకు ఇలా కావడానికి కారణం డాక్టర్స్ అంటున్నారు పలువురు. అసిస్టెడ్‌ రీప్రొడెక్టివ్‌ టెక్నాలజీ (రెగ్యులేషన్‌) బిల్లు-2017 ప్రకారం 18 ఏళ్ల లోపు, 45 ఏళ్ల పైబడిన వారికి ఈ చికిత్స అందించడం నిషేధం. అయినా కానీ 74 ఏళ్ల వయసులో ఆమె ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చేలా చేశారు డాక్టర్స్. ఆమెకు ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అసిస్టెడ్‌ రీప్రొడక్షన్‌, ఇండియన్‌ ఫెర్టిలిటీ సొసైటీ రీప్రొడక్షన్‌ తదితర సంఘాల అధ్యక్షులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంగాయమ్మకు చికిత్స అందజేసిన గుంటూరులోని అహల్య ఐవీఎఫ్ సెంటర్ తన నోటీసు బోర్డులో పేర్కొన్న వివరాలు చర్చనీయాంశమయ్యాయి. ఐవీఎఫ్‌ విధానానికి 45 ఏళ్లు పైబడి భార్య, 50 ఏళ్లు పైబడిన భర్తలను సెప్టెంబరు 2019 తీసుకోబోమని పేర్కొంది. ఏఆర్‌టీ బిల్లు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. ఇప్పుడు ఈ బామ్మకు, ఆమె భర్తకు ఏమైనా అయితే ఆ పిల్లల పరిస్థితి ఏమిటి అని అందరు కంగారు పడుతున్నారు. మరి ఈ బామ్మ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.