ఈ పాము కరిస్తే చర్మం కొవ్వత్తిలా కరిగిపోతుంది

246

పాము పేరు వింటేనే మన ఒంట్లో వణుకు పుడుతుంది.కారణం అవి చాలా డేంజర్.ప్రతి రోజు పాము కాటు వలన చాలా మంది చనిపోతు ఉంటారు.మామూలు పాము కరిస్తే అంత తీవ్రమైన సమస్య ఉండదు కానీ మరి విషం ఎక్కువ ఉన్న పాము కరిస్తే ప్రాణాలకే డేంజర్.ఈ ప్రపంచంలో లక్షల జాతుల పాములు ఉన్నాయి.వాటిలో ఎక్కువగా విషపూరీతమైనవే ఉంటాయి.అయితే ఏ పాము కరిచిన కదా మనిషి శరీరంలోకి విషం ఎక్కి అతను చనిపోయే అవకాశం ఉంది.కానీ ఒక పాము కరిస్తే మాత్రం శరీర చర్మం కరిగిపోతుంది.ఆశ్చర్యకరంగా ఉందా.కానీ ఇది నిజం.మరి ఆ పాము గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఆ పాము చూడముచ్చటగా ఉంటుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఆకర్షణీయంగా కనిపించే ఆ పాము.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది. అది కరిస్తే చర్మం కొవ్వొత్తులా కరిగిపోతుంది. ఆ పాము పేరే ‘గోల్డెన్ ల్యాన్స్‌హెడ్’.బ్రెజిల్‌లోని సావో పౌలో తీరానికి 32 కిమీల దూరంలో ఉన్న ‘స్నేక్ ఐలాండ్‌’లో ఈ సర్పజాతి నివసిస్తోంది. 110 చదరపు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ద్వీపంలో 4000 పైగానే పాములు నివసిస్తున్నాయి. ఇక్కడ ప్రతి అడుగు విస్తీర్ణంలో ఒక్కో పాము ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. ఎంతో ధైర్యం ఉంటేనే ఈ ద్వీపంలో అడుగుపెట్టాలి. గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ విషయం సాధారణ పాము కంటే ఐదు రెట్లు అధికం.11,000 ఏళ్ల కిందట ఈ దీవి బ్రెజిల్‌తో కలిసి ఉండేది. అయితే, సముద్ర మట్టం పెరగడం వల్ల పర్వత ప్రాంతం దీవిగా విడిపోయింది.

ఈ దీవిలో ప్రపంచంలోని అన్నిరకాల పాములు నివసిస్తున్నాయి. బ్రెజిల్ ప్రభుత్వం ఈ దీవిలోకి సాధారణ ప్రజల ప్రవేశాన్ని నిషేదించింది. కేవలం పరిశోధకులు, నేవీకి మాత్రమే అనుమతి ఉంది. అయితే, ఆ దీవిలోకి ప్రవేసించడం అంత సులభం కాదు. జారుడు స్వభావం కలిగిన రాళ్ల మీదకు ఎక్కుతూ దీవిలోకి వెళ్లాల్సి ఉంటుంది.1909లో ఇక్కడ ఒక లైట్‌హౌస్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహించే బాధ్యతను ఓ కుటుంబానికి ఇచ్చారు. అయితే, 1920లో దీవిలోని పాములు వారి నివాసంలోకి ప్రవేశించి, వారిని చంపేశాయి. ఆ తర్వాత కొన్నాళ్లు లైట్‌హౌస్‌ను మూసివేశారు. ఇటీవల అక్కడ ఆటోమెటిక్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ దీవి గురించి తెలియని చాలామంది అక్కడికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.ఇదండి ఈ పాము కథ.విన్నారుగా ఇది ఎంత డేంజరస్ పామో