ప్రపంచంలోనే అతిచిన్న పాప పుట్టింది..ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే.!

1163

తల్లిదండ్రులు కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.అందరికి ఆ కల నెరవేరుతుంది.కానీ కొంతమందికి పుట్టిన పిల్లలను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది.కారణం వింత వింత సమస్యలతో పుడతారు.ఇప్పుడు మీకొక పాప గురించి చెబుతా వినండి.మాములుగా అప్పుడే పుట్టిన పాప ఎంత బరువుంటుంది. రెండు నుంచి మూడు కిలోలు మహా అయితే 4 కిలోల బరువుటుంది. కానీ ఇక్కడో పాప జననం చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు.అంతలా ఆశ్చర్యపోయే విషయం ఏమిటా అనుకుంటున్నారా.ఆ పాప ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువున్న పాప.మరీ జన్మించిన ఆ పాప గురించి పూర్తీగా తెలుసుకుందామా.

సాధారణంగా డెలివరీ కాగానే పుట్టిన సంతానం ఎంత బరువుంది.? ఆరోగ్యంగా ఉందా అని చూస్తాం.. దాదాపు 2 కిలోల నుంచి 5 కిలోల లోపు బరువు ఉండే పిల్లలు పుడతారు. కానీ ఇక్కడ అద్భుతం జరిగింది. కేవలం 375 గ్రాముల బరువున్న పాప పుట్టింది. ఆ పాప పొడువు కూడా కేవలం 20 సెంటీమీటర్లు మాత్రమే పాప పాదాలు కేవలం గోరంత పరిమాణంలో ఉన్నాయి.ఆ పాపకు చెర్రీ అనే పేరు కూడా పెట్టారు.

చెర్రీ అని పేరు పెట్టుకున్న ఆ పాప బరువు చూసి అందరూ షాక్ అవుతున్నారు. కారణం చాలా చిన్నగా జన్మించడమే. పాప శరీరావయవాలు ఇంకా పూర్తిగా ఏర్పడనందువల్ల జీవక్రియలు సరిగా పనిచేయక ఇలాంటి శిశువులు పుడతారని చెప్పారు.అయితే ఈ పాప పుట్టిన తర్వాత ఆ పాప మీద ఎవ్వరికి ఆశలు లేవు.చివరికి ఆ పాప తల్లిదండ్రులకు కూడా.ఇలాంటి కేసుల్లో బిడ్డ జీవించే అవకాశాలు 0.5శాతం మాత్రమేనని వైద్యులు చెప్పారు.అయితే ఇక్కడే హైదరాబాద్ రెయిన్ బో ఆస్పత్రిలో వైద్యులు చరిత్ర సృష్టించారు. నాలుగు నెలలు ముందుగా 25 వారాలకే పుట్టిన పాపను బతికించారు.

సాధారణంగా ఇలా పుట్టిన పిల్లలు కాన్పులోనే కన్నుమూస్తారట.. కానీ రెయిన్ బో వైద్యులు పాపను బతికించి అద్భుతం చేశారు.ఈ విషయాన్ని వారి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది. చెర్రి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పాపను జాగ్రత్తగా ఈ లోకంలోకి తెచ్చిన వైద్యులకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు.దక్షిణాసియాలోనే ఇంత చిన్న పాప ఇప్పటివరకూ నమోదు కాలేదట.. ఇంత చిన్నగా పుట్టి బతికిన పాప ఈమేనట.. ఈ వార్త తెలిసి ఇప్పుడు వైరల్ గా మారింది. శిశువు కడుపులో ఇంకా అవయవాలు పూర్తి స్థాయిలో ఎదగలేదట. కానీ డాక్టర్లు వివిధ చికిత్సలు చేసి పాపను బతికించారు. ఇప్పటికీ చికిత్స కంటిన్యూ చేస్తారట. 2 ఏళ్ల వరకూ డాకర్లకు చూపిస్తూ పెంచాలని సూచించారట.. ఇలా దేశంలోనే అతిచిన్న పాప పుట్టి ఇప్పుడు ప్రపంచంలోకి వచ్చింది. ఆ పాప కలకాలం బతకాలని ఆశిద్ధాం.మరీ ప్రపంచంలోనే అతి చిన్నగా పుట్టిన ఈ పాప గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే ఇలా వింతగా పుట్టే శిశువుల గురించి అలాగే వాళ్ళు అలా పుట్టడం వెనుక ఉన్న విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.