జ‌పాన్ లో మాత్ర‌మే చూడ‌గ‌లిగేవి వింతలు

247

జ‌పాన్ టెక్నాల‌జీని అన్ని దేశాల కంటే ముందు అడ్వాన్స్ డుగా తీసుకువెళ్లే దేశం అని చెప్పాలి…ఈ దేశంలో క‌ష్టాన్ని ఎక్కువ న‌మ్ముతారు అంద‌రూ శ్ర‌మ జీవులే అని చెప్పాలి. విలాస‌వంతంగా ఉంటారు. అలాగే వీరిని ప‌ని రాక్ష‌సులు అంటారు, ఏదైనా ఓ ప‌ని మొద‌లు పెడితే ఆ ప‌ని పూర్తి అయ్యేవ‌ర‌కూ వేరేవాటిపై ధ్యాస కూడా పెట్ట‌రు.. మరి ఇక్క‌డ ఉన్న‌టువంటి కొన్ని డిఫ‌రెంట్ విష‌యాలు ఈ దేశంలో మాత్ర‌మే క‌నిపించే అనేక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాలు ఇప్పుడు చూద్దాం.

-జ‌పాన్ లో ప్ర‌త్యేకంగా బుల్లెట్ ట్రైన్స్ ,వుమెన్ ట్రైన్స్, పిల్ల‌ల ట్రైన్స్ ఉంటాయి. ఇక్క‌డ రైల్వేలు ఎవ‌రి వారికి విడిగా ట్రైన్ సౌక‌ర్యం క‌ల్పిస్తాయి.. విశాల‌వంత‌మైన రైల్వే లైన్లు ఇక్క‌డ ఉంటాయి. అందుకే రైల్వే టైమింగ్ కూడా జ‌పాన్ లో చాలా క‌రెక్టుగా ఉంటుంది.నో మేన‌స్ — అంటే ఈ ప‌దం వింటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌చ్చు.మ‌న దేశంలోనే కాదు ఎక్క‌డైనా ప్రెగ్నెంట్ మ‌హిళ‌ల‌కు, చిన్న‌పిల్ల‌ల‌కు అంగ‌వైక‌ల్యం ఉన్న‌వారికి వెంట‌నే బ‌స్సుల్లో ట్రైన్స్ లో వారికి కూర్చోవ‌డానికి సీటు ఇస్తాం, కాని జ‌పాన్ లో మాత్రం వారు ప్రెగ్మెంట్ అయినా చిన్న‌పిల్ల‌ల‌తో ఉన్నా వారికి సీటు ఇవ్వ‌రు, ఇక్క‌డ ఈ విష‌యంలో నో కాంప్ర‌మైజ్ అనే అంటారు జ‌పాన్ జ‌నం.

ఈ క్రింది వీడియో చూడండి

రిలాక్స్ గాడ్జెట్స్-
ఇక్క‌డ వీరిని అంద‌రిని ప‌నిరాక్ష‌సులు అంటారు. అందుకే రాత్రి స‌మ‌యాల్లో ఆఫీసు అయిన త‌ర్వాత ఉద‌యం ఇంటికి వెళ్లే స‌మ‌యంలో, ట్రైన్ లో ప్ర‌యాణం చేస్తుంటే, వారికి నిద్ర వ‌స్తుంది. ఈ స‌మ‌యంలో ఓ ర‌బ్బరు వంటి స్టాండ్ ఇక్క‌డ ఉంటుంది. అక్క‌డ తల ఆన్చుకుని నిద్ర‌పోతారు. దీనికి బెల్ట్ ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాదం వారికి జ‌ర‌గ‌దు .వారి స్టేష‌న్ రాగాగే అల‌ర్ట్ రింగ్ వ‌స్తుంది వారు దిగిపోతారు.

ఐస్ క్రీమ్ ప్లేవ‌ర్స్
ప్ర‌పంచంలో ఎక్క‌డా దొర‌క‌ని ఐస్ క్రీమ్ ఫ్లేవ‌ర్స్ ఇక్క‌డ దొరుకుతాయి, ముఖ్యంగా చాకో స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ కాకుండా అనేక ర‌కాల ఐస్ క్రీమ్ ప్లేవర్స్ ఇక్క‌డ ఉంటాయి. బీర్ ,హార్స్ , మీట్, నూడిల్స్ , ఇలా అనేక ర‌కాల ఫ్లేవ‌ర్స్ దొరుకుతాయి. నిజ‌మే వారి టేస్ట్ డిఫ‌రెంట్ కాబ‌ట్టి వారి రుచులు కూడా ఇలాంటి వాటిలో డిఫ‌రెంట్ చూపిస్తారు.

Image result for japan girls

రాబిట్ ఐలాండ్…. ఇక్క‌డ ల‌క్ష‌లాది కుందేళ్లు ఉంటాయి… ఉకినోషిమో అనే ఐలాండ్ ఇది.. ఇక్క‌డ కుందేళ్ల సంత‌తి చాలా ఉంటుంది. దీనిని టూరిస్ట్ అట్రాక్ష‌న్ ప్లేస్ గా కూడా చెబుతారు. సుమారు 4 ల‌క్ష‌ల కుందేళ్లు ఇక్క‌డ ఉంటాయి వాటికి ఆహారం అంతా టూరిస్టులే ఇస్తున్నారు అంటే తెలుసుకోవ‌చ్చు నిత్యం ఎంత మంది వ‌స్తున్నారో.

టాయిలెట్ మ్యూజియం.. ఇది చాలా చిత్ర‌మైన మ్యూజియం ఇది ఎంట్ర‌న్స్ నిజ‌మైన టాయిలెట్ లాగానే ఉంటుంది, ఇక్క‌డ జ‌పాన్ లో కొన్ని జంతువుల మ‌ల మూత్రాలు భ‌ద్ర‌ప‌రిచి ఉంటాయి అనేక జంతువుల మూత్రాలు మ్యూజియంలో పెట్టారు ఇక్క‌డ 1500 ర‌కాల జంతువుల మ‌ల‌మూత్రాల న‌మూనాలు ఉంటాయి అయితే కొన్ని మ‌నుషుల‌వి కూడా ఉంటాయి ఇవి కేవ‌లం వ్యాక్స్ తో న‌మూనాలుగా త‌యారుచేసిన‌వి మాత్ర‌మే

Image result for japan girls

టాయిలెట్స్
ఇలాంటివి మ‌రెక్క‌డా క‌నిపించ‌వు అనే చెప్పాలి, టాయిలెట్స్ లో కూడా టెక్నాల‌జీని మిళితం చేశారు.. అన్నిదేశాల కంటే టాయిలెట్స్ నిర్వ‌హ‌ణ‌లో ముందు అడుగువేసింది జ‌పాన్. ఇక్క‌డ అన్ని ఆటోమెటేడ్ బ‌ట‌న్ ద్వారా జ‌రుగుతాయి. టాయిలెట్స్ లో ఉంటే ఐదు నిమిషాల స‌మ‌యంలో కూడా మీరు మ్యూజిక్ విన‌చ్చు, మెడిక‌ల్ సెన్సార్లు ఉంటాయి, అలాగే ఇవి శ‌రీర ఉష్ణోగ్ర‌త బీపీని తెలియ‌చేస్తాయి

ప్లాస్టిక్ ఫుడ్
మ‌నం ఏదైనా షాపుల్లో ఫుడ్ ఐటెం డిస్ ప్లేలో పెట్ట‌డం చూస్తు ఉంటాము.. ఇక్క‌డ కూడా ఇలా బేక‌రీల్లో ఫుడ్ ఐటెం పెట్టేవి ఏమిటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.. అందంగా వ్యాక్స్ లేదా కొత్త స్పాంజీల‌తో త‌యారుచేసిన ప‌దార్దాలు పెడ‌తారు.. జ‌పాన్ వారి రెస్టారెంట్లు స్వీట్ షాపుల్లో షో కేసుల‌లో ఇవే పెడ‌తారు, ఎందుకు అంటే కొద్ది గంట‌ల త‌ర్వాత ఫుడ్ ఫాడై పోతుంది అనే ఉద్దేశ్యంతో.. కాని ఇది కొత్త‌గా వెళ్లిన వారికి డ‌మ్మి ఫుడ్ అని చెబితే కాని తెలియ‌దు.

Related image

డ‌బుల్ టీత్… ముఖ్యంగా చాలా మంది ప‌న్నుపై పన్ను ఉంటే తెగఫీలై పోతారు. ఇలా డ‌బుల్ టీత్ ఉంటే ఇబ్బందిగా నామోషీగా అనుకుంటారు కాని జ‌పాన్ లో అమ్మాయిల‌కు ఇది చాలా ఇష్టం కొంద‌రు అయితే ఏకంగా స‌ర్జ‌రీ కూడా చేయించుకుంటున్నారు.

పెట్స్.. జ‌పాన్ లోపెట్స్ పెంచుకోవ‌డం అంటే చాలా కాష్ట్ అనే చెప్పాలి మ‌న దేశంలో ఓ కారు కొన్న‌ట్లే అక్క‌డ పెట్స్ ని పెంచుకుంటే అందుకే ఇక్క‌డ వారు రోబోటిక యానిమ‌ల్స్ ని పెట్స్ గా పెంచుకుంటారు. వీటికి నిర్వ‌హ‌న ఖ‌ర్చు ఫీడింగ్ ఖ‌ర్చు కూడా ఉండ‌దు. ఇవి మొత్తం సెన్సార్ల ద్వారానే ప‌నిచేస్తాయి.

క్యాప్సుల్స్ రూమ్స్….వీటిని ఎక్కువ‌గా టూరిస్టుల కోసం ఏర్పాటు చేశారు. ఒక‌టి లేదా రెండు రోజులు ఎక్క‌డికి అయినా ప్ర‌యాణానికి వెళితే వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు.. రెంట్ కూడా చాలా త‌క్కువగా ఉంటుంది. మ‌రి చూశారుగా వీరి వింత ఆచారాలు అల‌వాట్లు మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.