హైద‌రాబాద్ లో అమ్మాయిల‌కు ఇళ్లు అద్దెకు ఇవ్వ‌డం లేదు ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

631

హైద‌రాబాద్ మెట్రో పాలిటిన్ సిటీ కాస్మోపాలిట‌న్ సిటీగా మార‌డానికి డ‌వ‌ల‌ప్ మెంట్ అవుతున్న న‌గ‌రం.. ఇలాంటి న‌గ‌రానికి రోజూ వేలాది మంది వ‌స్తూ ఉంటారు.. అయితే కొంద‌రు చ‌దువుకోవ‌డానికి కూడా వ‌స్తూ ఉంటారు.. ఇలా అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ‌గా హాస్ట‌ల్స్ లో ఉంటారు. ఇంకొంద‌రు రూమ్స్ తీసుకుని ఉంటారు. కాని ఇప్పుడు ఓ వార్త హైద‌రాబాద్ నగ‌రంలో తెగ వైర‌ల్ అవుతోంది .ఏమిటి అని అనుకుంటున్నారా అస‌లు విష‌యం ఏమిటంటే?

Image result for hyd girls hostel

హైదరాబాద్ లో ఇంటి ఓనర్లు అమ్మాయిలకు రూమ్ అద్దెకు ఇవ్వడానికి వెనుకడగు వేస్తున్నారట. ఎందుకు అనుకుంటున్నారా? అమ్మాయిలు మాంసాహారం తింటున్నారట. హైదరాబాద్ లో ఇంటి ఓనర్లు అమ్మాయిలకు రూమ్ అద్దెకు ఇవ్వడానికి జంకుతున్నారని ‘నెస్ట్ అవే’ అనే ప్రముఖ హోమ్ రెంటల్ సంస్థ తెలిపింది. అనేక ప్రాంతాల నుంచి చదువు కోసమో లేక ఉద్యోగాల కోసమో అధిక సంఖ్యలో అమ్మాయిలు హైదరాబాద్ కి వస్తున్నారు. ఇలా వ‌చ్చిన వారు రూమ్స్ తీసుకుని న‌లుగురు లేదా ఐదుగురు క‌లిసి ఉంటున్నారు. వీరు ఎక్కువ‌గా మాంసాహారం తింటుటున్నార‌ని అందుకే వీరికి హౌస్ ఇవ్వ‌డానికి జంకుతున్నార‌ట ఇంటిఓన‌ర్లు.

అలాగే ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. హైదరాబాద్ ఇంటి ఓనర్లలో 19 శాతం మంది మాంసాహారం తినేవారికి రూములు అద్దెకు ఇవ్వడం లేదట…కొంతమంది ఓనర్లు ప్రాంతీయతత్వంతో.. మరి కొందరు ఓనర్లు కులమతాల కారణంగా రూమ్ అద్దెకు ఇవ్వడం లేదట. అయితే.. మిగతా విషయాలు కొంత వరకు నిజమై ఉండొచ్చని, నాన్ వెజ్ అనేది మాత్రం సమస్య కాదని కొందరు చెబుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

హైదరాబాద్ లో ఎక్కువ మంది మాంసాహారం తీసుకునే వారే ఉన్నారని.. అందువలన నాన్ వెజ్ అనేది మాత్రం సమస్య కాదని కొందరు చెబుతున్నారు. అయితే.. కులాల పరంగా కొంత మంది మాంసాహారం తీసుకోరు కనుక.. మాంసాహారం తినేవారికి రూములు అద్దెకు ఇవ్వడం లేదని కొందరు చెబుతున్నారు. ఇదెక్క‌డ చోద్యం అని అనుకోకండి ఎంతో కొంత ప‌ల్స్ తీసుకుని ఆ స‌ర్వే చేసి ఉంటారు. మ‌రి ఇలాంటి ఆచారాలు న‌మ్మ‌కాలను మీరు న‌మ్ముతారా, దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.