పోలిస్ స్టేషన్ లోనే దర్జాగా డ్రగ్స్ తీసుకుంటున్న యువతీ..

706

పంజాబ్‌ రాజకీయాలన్ని ఇప్పుడు డ్రగ్స్‌ చుట్టే తిరుగుతున్నాయి. ఓ వైపు అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్‌ సమస్యను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతుంటే.. పోలీసులు మాత్రం మాకు ఇవేవి పట్టవన్నట్టు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఫిరోజ్‌పూర్‌ డీఎస్పీ ఒక మహిళకు బలవంతంగా మత్తు పదార్ధాలు అలవాటు చేసిన సంగతి బయటకు రావడంతో మొత్తం పోలీస్‌ శాఖ మీదనే చెడు అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపధ్యంలో పోలీసు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే వీడియో మరొకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.దాని గురింఛి పూర్తీగా తెలుసుకుందాం.

Related image

పంజాబ్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో రికార్డు చేసినట్టుగా చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త పెళ్లికూతురు సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటోంది. ఓ కొవ్వొత్తి ముందు వెడ్డింగ్ బ్యాంగిల్స్ ధరించి కూర్చున్న ఓ యువతి, ఫాయిల్ పేపర్ పై ‘చిట్టా’ వేసి దానికి కొవ్వొత్తి వేడిని చూపించి, పీల్చుతూ మత్తులోకి వెళుతోంది. హెరాయిన్, ఎల్ఎస్డీ (లైసర్జిక్ యాసిడ్ డైథెలమైడ్) మెటామఫిటమైన్ తదితర వాటిని పంజాబ్ ప్రాంతంలో ‘చిట్టా’గా పిలుస్తారు.ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసుల పాత్రపై విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోలో ఓ పోలీసు అధికారి, తాను జలంధర్ లో రైడ్ కు వెళుతున్నట్టు చెప్పిన గొంతు వినిపిస్తోంది. ఆమె ఓ బలమైన ఇనుప పెట్టెపై కూర్చుని ఉండగా, అటువంటి బాక్స్ లు పోలీసు స్టేషన్లలోనే సహజంగా కనిపిస్తుంటాయి. వాటిల్లో ఆయుధాలను దాచుతుంటారు. ఇటీవల ఫిరోజ్ పూర్ డీఎస్పీ, బలవంతంగా ఓ యువతికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్టు కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ కాగా, పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

ప్రస్తుత వీడియో కూడా పోలీస్‌స్టేషన్‌లో తీసిందిగా అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో యువత మత్తు పదార్థాలకు ఎంతలా బానిసలయ్యారే ఈ వీడియో అద్దం పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం మాత్రం శున్యం. డ్రగ్స్‌కు అలవాటు పడిన మహిళల కోసం తొలిసారిగా 2016 మేలో పునరావాస కేంద్రాన్ని పంజాబ్‌లో ఏర్పాటు చేశారు. మరోవైపు డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలకు పంజాబ్ ప్రభుత్వం ఉపక్రమించింది. డ్రగ్స్ అమ్మినా, అక్రమంగా సరఫరాచేసినా మరణశిక్ష విధిస్తామని గత సోమవారం ప్రకటించింది.అయినా పోలిస్ స్టేషన్ లోనే ఇలా జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.మరి ఈ సంఘటన గురించి అలాగే డ్రగ్స్ తీసుకోవడం తప్పని చెప్పే పోలీసులే ఇలాంటివి జరుగుతుంటే ఏమి అనకపోవడం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.