బెయిల్‌పై విడుదలైన ప్రియుడితో కలిసి భర్తను చంపిన స్వాతి..ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలిస్తే షాక్..

2296

ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హతమార్చిన నాగర్ కర్నూల్ స్వాతి బెయిల్‌పై విడుదలయ్యింది. 8 నెలల తర్వాత ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మహబూబ్‌నగర్ జైలు నుంచి విడుదల చేశారు.అయితే ఆమె విడుదల అయ్యి ఎక్కడికి వెళ్ళింది.ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా..ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for swathi tried to kill her husband with boy friend

మహబూబ్ నగర్ కొత్తకోట మండలం అజ్జకోలు గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డితో స్వాతికి వివాహంకాగా ఇద్దరు పిల్లలు. ఆమె రాజేష్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. ప్రియుడి మోజులో పడి గతేడాది నవంబర్‌లో సుధాకర్‌రెడ్డిని హతమార్చేందుకు స్కెచ్ వేసింది. ప్రియుడు రాజేష్‌తో కలిసి నాగర్‌కర్నూల్‌లోని తన ఇంట్లోనే సుధాకర్‌రెడ్డిపై దాడి చేసి చంపేశారు. డెడ్ బాడీని కారులో తీసుకెళ్లి నవాబుపేట సమీపంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. తర్వాత రాజేష్ మొహంపై యాసిడ్‌ పోసి అతడే సుధాకర్‌రెడ్డిగా నమ్మించే ప్రయత్నం చేశారు.రాజేష్‌నే సుధాకర్ రెడ్డిగా భావించి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని స్వాతి భావించింది.

Image result for swathi tried to kill her husband with boy friend

సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు కూడా మొహానికి బ్యాండేజ్‌లు ఉండటంతో అతడ్ని గుర్తించలేకపోయారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్సపొందుతన్న రాజేష్ తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు సుధాకర్‌రెడ్డి పేరిట చికిత్స పొందుతున్న రాజేష్‌ వేలిముద్రలు సేకరించడంతో గుట్టురట్టయింది. ఈ హత్య వ్యవహారం మొత్తం బయటపడింది. స్వాతితో పాటూ ప్రియుడు రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలలుగా ఇద్దరు మహబూబ్‌నగర్ జైల్లో ఉండగా స్వాతికి బెయిల్ మంజూరయ్యింది.

జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా స్వాతి విషయంలో హైడ్రామా నడిచింది.స్వాతిని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో ఒంటరిగా పంపిస్తే ఎవరైనా దాడి చేసే అవకాశముందని అధికారులు భావించారు.ముందు హైదరాబాద్‌లోని స్టేట్ హోంకు పంపాలనుకున్నా కలెక్టర్ లేకపోవడంతో నిర్ణయం మార్చుకొని మహబూబ్‌నగర్‌లోని హోంకే తరలించారు.బెయిల్‌పై బయటకొచ్చిన తర్వాత ఆమెతో మీడియా మాట్లాడించే ప్రయత్నం చేయగా ఏమీ మాట్లాడలేకపోయింది.కన్నీళ్లే ఆమె సమాధానమయ్యింది.భర్తను దారుణంగా హతమార్చి జైలు పాలైన స్వాతి తన ఇద్దరు పిల్లల్ని కూడా అనాధల్ని చేసింది.ఇప్పుడు తాను కూడా ఒంటరిగా మిగిలిపోయింది.అందరూ ఉన్నా ఏకాకిగా మారింది. చివరికి ఆమె తండ్రి కూడా తన కూతురు చనిపోయిందని గుండు గీయించుకున్నాడు.అటు అత్తింటివాళ్లు కూడా ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు.ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించింది.మరి ఈ విషయం గురించి ఆమె భర్తను చంపినా విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.