ఈ పోలీస్ ఆఫీసర్ చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..

449

ఆడవారికి జుట్టే అందం. రెండు వెంట్రుకలు రాలిపోతేనే కొంప మునిగినట్టు ఏడుస్తారు. అలాంటిది గుండు చేయించుకోమంటే ఎవరైనా చేయించుకుంటారా..అస్సలు చేయించుకోరు. ఎందుకంటే ఆడవారు జుట్టు లేకపోతే అందంగా కనిపించరు. అందుకే వారు వెంట్రుకల మీద అంత ప్రేమ పెంచుకుంటారు. అయితే ఇప్పుడు ఒక లేడి పోలీస్ ఆఫీసర్ తన జుట్టు అంతటిని తీసేసి గుండు చేయించుకుంది. ఆమె మాములుగా గుండు చేయించుకుంటే వార్త అయ్యేది కాదు కానీ ఆమె ఒక మంచి పని కోసం ఆ పని చేసింది. మరి ఎందుకలా చేసిందో చూద్దామా.

Image result for అపర్ణా లవకుమార్‌

కేరళలో సీనియర్ సివిల్ పోలీస్ అధికారిణి అపర్ణా లవకుమార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 46 ఏళ్ల ఆమె కొన్నేళ్లుగా తాను పెంచుకున్న జుట్టును కాన్సర్ పేషెంట్ల కోసం దానం చేసేశారు. మహిళలకు జుట్టే అందం. అందుకే వాళ్లు జుట్టును ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. రెండు వెంట్రుకలు రాలినా ఎంతో ఆందోళన చెందుతారు. అలాంటిది ఆమె మాత్రం మోకాళ్ల దాకా ఉండే జుట్టును మరో ఆలోచన లేకుండా మొత్తం ఇచ్చేసి బోడి గుండుతో కనిపిస్తున్నారు. పైకి అందంగా కనిపించాలనే ఆలోచనకు ఆమె ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అసలైన అందం అంటే మనసులో కల్మషం లేకుండా ఉండటమేనని నిరూపించారు. ఆమె దానం చేసిన జుట్టుతో కాన్సర్ పేషెంట్లకు విగ్స్ తయారుచేస్తున్నారు. కాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ చేయించినప్పుడు రేడియేషన్ వల్ల జుట్టు మొత్తం రాలిపోతుంది. అసలే కాన్సర్ వల్ల వాళ్లలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పడిపోతాయి. ఇక జుట్టు కూడా రాలిపోతే వాళ్లు మరింత డీలా పడిపోతారు. ఇలాగే బాధలో ఉన్న 5వ తరగతి విద్యార్థిని కలిసిన అపర్ణా తన జుట్టును పూర్తిగా ఇచ్చేయాలని డిసైడయ్యారు. ఇద్దరు పిల్లలకు తల్లైన ఆమె కేరళలోని త్రిచూర్‌లో ఇరిన్జలకుడ మహిళా పోలీస్ స్టేషన్‌లో చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

జుట్టు లేని పిల్లల్ని చూసి ఇతర పిల్లలు హేళన చేస్తుంటారన్న అపర్ణ… ఆ పరిస్థితులు చిన్నారుల హృదయాలపై తీవ్ర మానసిక వేదన కలిగిస్తాయని అన్నారు. కాన్సర్ విద్యార్థితో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత అపర్ణ ఒల్లూర్‌లోని పార్లర్‌కి వెళ్లి మొత్తం జుట్టు తీయించేసుకున్నారు. ఇదివరకు కూడా ఆమె ఇలాగే జుట్టు ఇచ్చారు. ఐతే అప్పట్లో భుజాల వరకూ జుట్టును ఉంచుకున్నారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఇచ్చేశారు. ఐతే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాళ్లు జుట్టును పూర్తిగా తీసేసుకోకూడదు, గడ్డం పెంచుకోకూడదు. అలాంటి వాటికి అధికారుల పర్మిషన్ తప్పనిసరి. ఈ విషయంలో అపర్ణ నిర్ణయాన్ని మంచి మనసుతో స్వాగతించారు త్రిచూర్ రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ IPS. 2008లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెడ్ బాడీని రిలీజ్ చేయించేందుకు, ఆస్పత్రి బిల్లులు చెల్లించేందుకు తన బంగారు గాజుల్ని బాధితులకు ఇచ్చేశారు. ఇలాంటి పనుల వల్ల పోలీసులు, ప్రజల మధ్య గ్యాప్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు అపర్ణ. ఆమె చేస్తున్న దానాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ లేడి పోలీస్ చేసిన ఈ మంచి పని గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.