మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తకు బుద్ది చెప్పాలని ఆ భార్య ఏం చేసిందో తెలుసా..

547

ఆడది ఏదైనా సహిస్తుంది కానీ…తన భర్తను మరొకరు పంచుకోవడం చూస్తే అస్సలు సహించదు.ఇది వాస్తవం.ఒకవేళ తన భర్తకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని తెలిస్తే కొంతమంది బాధను వేరే వాళ్లకి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. మరికొంత మంది విడాకులు తీసుకుంటారు. కానీ ఆ మహిళ మాత్రం తన భర్తకు తగిన గుణపాఠం నేర్పింది. దెబ్బకు అతను మళ్ళీ ప్రియురాలి జోలికి వెళ్ళలేదు.ఇంతకు ఆ భార్య ఏం చేసింది.ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for indian wife and husband telugu

విశాఖపట్నం అరకుకి చెందిన తులసి రాంకు , శ్రీకాకుళం కి చెందిన వనజకు పెద్దలు నెలక్రితం వివాహం చేసారు. పెళ్ళైన దగ్గరినుండి భర్త తులసి భార్యను ఫోన్ నెంబర్ మార్చెయ్యమన్నాడు. స్లీవ్ లెస్ డ్రస్సులు, జాకెట్లకు రంద్రాలు ఉండడం, ఫ్రెండ్స్ తో మాట్లాడడం అని మానుకోమన్నాడు. ఫేస్ బుక్ అకౌంట్‌ను డిలీట్ చేయమన్నాడు. దీంతో చెప్పింది భర్తే కదా అని తనకు ఇష్టం లేకున్నా సరే వనజ అన్నింటినీ వదులుకుంది.ఆ తర్వాత నెల రోజుల వరకు భార్యను బాగానే చూసుకున్నాడు.కానీ ఆ ఆరువాత అసలు కథ మొదలైంది.పెళ్ళికి ముందే తులసికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది.కానీ ఏ కారణం వల్లనో వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు పోలేదు.దాంతో వనజను పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్ళైన తర్వాత మాజీ ప్రియురాలితో మళ్ళీ పరిచయం పెట్టుకున్నాడు. ఫోన్లు, ఛాటింగ్‌లు చేస్తూ భార్యను మరిచిపోయాడు.ఈ విషయం తెలుసుకున్న భార్య భర్తను వేడుకుంది. తనకు అన్యాయం చేయొద్దని బతిమిలాడింది. అయితే అతను ఒప్పుకోలేదు.

దీంతో వనజ కూడా ఒకడుగు ముందుకు వేసింది. భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. ఫేస్ బుక్ అకౌంట్‌ను మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసింది.గతంలో తనకు ఉన్న పరిచయాలతో బాయ్ ఫ్రెండ్లతో చాటింగ్ మొదలెట్టింది. ఫోన్లలో గంటల తరబడి మాట్లాడటం ప్రారంభించింది.పరిచయం లేని వ్యక్తులతోను గంటల తరబడి మాట్లాడేది.ఈ విషయంపై భార్యాభర్తలు ఎప్పుడు గొడవపడే వారు.అయినా వనజ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.దీంతో భర్త ఓ మెట్టు దిగిరావాల్సి వచ్చింది.ఇలా తన భర్త తనకు బాగా దగ్గరయ్యాడని, ఇప్పుడు ఎలాంటి సమస్య లేదంటోంది వనజ. ఎలాంటి ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది వనజ.చూశారుగా అక్రమ మార్గంలో వెళ్తున్న తన భర్తను ఈ మహిళ ఎలా దారిలోకి తెచ్చుకుందో.కాబట్టి మీ భర్తలు కూడా అక్రమ మార్గంలో వెళ్తే ఇలా మీరు కూడా ఏదో ఒకటి చేసి మీ భర్తను సరైన మార్గంలోకి తెచ్చుకోండి.అంతేకానీ భర్త మోసం చేశాడని మీకు అన్యాయం చేశాడని ఆత్మహత్య లాంటి పనులు మాత్రం చేసుకోకండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.అక్రమ మార్గంలో వెళ్ళిన తన భర్తను మంచి మార్గంలోకి తెచ్చుకున్న ఈ వీర వనిత గురించి అలాగే ఇలా అక్రమ మార్గంలో వెళ్ళే భర్తలను ఇంకా ఏ ఏ విధంగా మార్చుకోవాలో తెలియజేస్తూ మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

అద్వానీని కలిసిన మమతా…కారణం తెలిస్తే షాక్..