పోలీస్ స్టేషన్ కు నగ్నంగా వెళ్లిన మహిళ..షాక్ లో పోలీసులు

184

కొన్ని కొన్ని ఘటనలు చదువుతూ ఉంటే మనం ఇండియాలోనే ఉన్నామా లేదంటే ఏదైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే అనుమానాలు కలుగుతాయి. అందులో ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన కూడా ఒకటి. ఆడపిల్ల సమాజంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంటుందో మనం ప్రతిరోజు కళ్లారా చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రుల వద్ద ఉన్నంతవరకే సుఖం. గడప దాటి బయట అడుగు పెడితే ఆమెకు నరకమే. అత్తారింట్లో అయితే ఆమె పడే బాధలు అన్నీఇన్నీ కావు. అత్తింటి వేధింపులకు గురైన ఓ మహిళ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఘటన రాజస్థాన్‌ లో చోటుచేసుకుంది. మరి ఈ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు రాజస్థాన్‌ చురూ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయినవాళ్లందర్నీ వదిలి అత్త వారింటికి చేరిన ఆ మహిళ నిత్యం నరకమే అనుభవించింది. కోటి ఆశలతో కట్టుకున్నవాడి ఇంటికొస్తే జీవితం దుర్భరంగా మారింది. పెళ్లైన నాటి నుంచి ఆ మహిళకు వేధింపులు ఎదురయ్యాయి. అన్నింటినీ భరించుకుంటూ వచ్చిన సదరు మహిళను అత్త, ఆడపడుచులు మరింత వేధించారు. ఆదివారం నాడు ఆ మహిళపై అత్తింటివారు మరోసారి ప్రతాపం చూపించారు. సూటిపోటి మాటలతో వేధిస్తూ చిత్రహింసలు పెట్టారు. ఆమె భర్త పని మీద అసోంకు వెళ్లడంతో వారు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. సాటి మహిళ అని కూడా చూడకుండా క్రూరంగా హింసించారు. చివరకు ఆమె బట్టలు కూడా చింపేశారు. అయితే అప్పటివరకు సహనంతో భరించిన బాధితురాలికి ప్రాణభయం పట్టుకుంది. తాను అక్కడే ఉంటే చంపేసేలా ఉన్నారనుకుని బయటకు పరుగులు తీసింది.

ఈ క్రింది వీడియో చూడండి

అలా ఒంటిపై బట్టలు లేకుండానే బాధితురాలు పోలీస్ స్టేషన్ వైపు పరుగులు పెట్టడంతో ఆ రోడ్డు వెంబడి వెళ్లేవారు మానవత్వం చూపించలేదు. పైగా కొందరు ఫోటోలు, వీడియోలు తీయడం కలకలం రేపింది. మొత్తానికి ఆమె పోలీస్ స్టేషన్ కు చేరి ఫిర్యాదు చేయడంతో రక్షణ కల్పించారు. అత్తింటివారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు వెంట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు తొలగించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసినవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఉన్నతాధికారులు. ఎవరికైనా షేర్ చేస్తే వారికి కఠిన శిక్షలు వేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్ యాంగిల్ కూడా ఉందని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మరి ఈ ఘటన గురించి అలాగే సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.