కన్నబిడ్డ అన్నం తినలేదని ఈ తల్లి ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో తెలిస్తే చెప్పుతో కొడతారు..

251

స్పృష్టికి మూలం అమ్మ. అమ్మలేనిది ఈ ప్రపంచమే లేదు. ఉన్నాడో లేడో తెలియని దేవుడి కన్నా కనిపించే అమ్మనే గొప్ప. ఏ తల్లి అయినా బిడ్డ క్షేమాన్ని కోరుతుంది. బిడ్డ ఏం చేసిన తల్లి క్షమిస్తుంది. ఏం చేసిన సరే సహిస్తుంది. అయితే మారుతున్న కాలం కొద్దీ తల్లి ప్రేమలో కూడా తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు చిన్న పిల్లలాగా ఉన్నప్పుడు తల్లి అన్నిటిని భరిస్తుంది. వారు ప్రతి దానికి ఏడుస్తారు.తిండి తినరు. అల్లరి అల్లరి పనులు చేస్తారు. వీటన్నిటిని తల్లి తట్టుకోవాలి. కానీ అలా భరించడం ఇప్పటి తల్లుల వల్ల అవ్వడం లేదు. కొడుకు అన్నం తినకపోతే తల్లులు బుజ్జగించి తినిపిస్తారు కానీ ఓ తల్లి గోరుముద్దలు తినలేదని కిరాతకంగా మారింది.మరి ఏం చేసిందో తెలుసుకుందామా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

న్యూజెర్సీకి చెందిన నకీరా గ్రైనర్ తన పిల్లాడు ఆహారం తినలేదని, చెప్పిన మాట వినలేదని కుక్కను కొట్టినట్లు కొట్టింది. మెట్లపై ఉన్న బాబుని తంతే ఒకటవ అంతస్తుపై నుండి దొర్లుకుంటూ క్రింద పడ్డాడు. ఆ బాలుడికి ముఖాన తీవ్ర గాయాలు అయ్యి ఏడుస్తుంటే కూడా హృదయం కరగలేదు. గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లవాడిని ఉయ్యాలలో పడేసి వెళ్లిపోయింది. ఇంతకీ ఆ బాలుడి వయస్సు 23 నెలలు మాత్రమే. రెండేళ్లు కూడా లేని ఆ బాలుడు ఏడ్చి ఏడ్చి ఉయ్యాలలోనే చనిపోయాడు.

Image result for mother depressionకొద్దిసేపటికి ఏడుపు వినపడకపోవడంతో నకీరా అక్కడికి తిరిగి వచ్చింది. చనిపోయి పడి ఉన్న పిల్లాడిని భయపడిపోయింది. శవాన్ని తీసుకువెళ్లి పెరటిలో కిరోసిన్ పోసి నిప్పంటించి దహనం చేసింది. ఆ బూడిదను అక్కడే పాతిపెట్టింది. చట్టం నుండి తప్పించుకోవడానికి మరో ఎత్తు వేసింది. నెట్టుకుంటూ వెళ్లే ఉయ్యాలలో పిల్లాడి బూట్లు వేసి ఇంటికి కొద్ది దూరంలో విడిచిపెట్టింది. పోలీసులకు ఫోన్ చేసి, బాబును బయటకు తీసుకువెళుతుండగా కొందరు దుండగులు వారిపై దాడి చేసి పిల్లాడిని ఎత్తుకు వెళ్లిపోయారని ఫిర్యాదు చేసింది. తనపై కూడా దాడికి దిగినట్లు చెప్పింది. పిల్లాడి కోసం గాలింపులు మొదలు పెట్టిన పోలీసు జాగిలాలు నకీరా ఇంటి దగ్గర తోటలో ఆనవాళ్లు కనుగొన్నాయి. దాంతో పోలీసులు నకీరాను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె అసలు నిజం బయటపెట్టింది. ఇప్పుడు కోర్టులో హాజరుపరచనున్నారు.చూశారుగా ఈ తల్లి ఎంతటి పని చేసిందో. మరి ఈ తల్లి ఘటన గురించి అలాగే రోజురోజుకు తగ్గిపోతున్న తల్లీబిడ్డల బంధాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.