లైంగికంగా వేధిస్తున్నాడని ఈ మహిళ అతని పురుషాంగాన్ని ఏం చేసిందో తెలిస్తే మెంటల్ ఎక్కుతుంది..

431

సమాజంలో స్త్రీలను లైంగికంగా వేధించేవాళ్ళు అడుగడుగునా ఉన్నారు. ఒంటరిగా వెళ్తే ఎక్కడ ఏం చేస్తారో అని భయపడి ఒంటరిగా వెళ్ళడానికే భయపడతారు మహిళలు. అయితే కొందరు అమ్మాయిలు దైర్యం తెచ్చుకుని వాళ్లకు తగిన బుద్ధి చెబుతారు. అయితే మగాళ్లకు బుద్ధి చెప్పే క్రమంలో కొందరు మహిళలు దారుణాలకు కూడా పాల్పడుతున్నారు. వేధిస్తున్నాడని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు ఒక మహిళా అయితే చాలా దారుణమైన పని చేసింది. మరి ఏం చేసిందో తెలుసుకుందామా.

Image result for indian women

ముంబయిలోని డోంబివలికి చెందిన వివాహితకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. వారికి ఎదురింట్లో ఉండే ఉన్న తుషార్ పుజారే (27) అనే యువకుడు గృహరుణాలు ఇప్పించే సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ మహిళను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి తన కోరిక తీర్చమంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. తాను వివాహితనని, భర్తతోపాటు ఇద్దరు పిల్లలున్నారని చెప్పినా అతడు వినిపించుకోవడం లేదు. కావాలనే అసభ్యంగా తాకుతూ హింసిస్తున్నాడు. అతని వేధింపులు రోజు రోజుకీ పెరిగపోతుండటంతో యువతి సహించలేకపోయింది.ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. దీనికంతటికీ కారణమైన తుషార్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న మహిళ ఇద్దరు యువకులతో పథకం వేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తనకు ఇంటి రుణం కావాలని వివాహిత తుషార్‌కు చెప్పడంతో ఆమెను లొంగదీసుకునే ఛాన్స్ దొరికిందని ఆమె ఇంటికి ఉత్సాహంగా వెళ్లాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఇద్దరు యువకులతో కలిసి ఆమె తుషార్‌ను చితకబాదింది. ఆవేశం ఆపుకోలేక కత్తితో అతడి పురుషాంగాన్ని కోసి పారేసింది. బాధతో విలవిల్లాడుతున్న అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పురుషాంగంతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వివాహితతో పాటు ఆమెకు సహకరించిన తేజాస్ మహాత్రే(22), ప్రవీణ్ కెనియా (25) లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తుషార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. చూశారుగా ఈ వివాహిత ఎంతటి పని చేసిందో. ఎవరైనా వేధిస్తే పోలీసులకు చెప్పాలి లేదా వేరే విధంగా పరిష్కరించుకోవాలి కానీ ఎవరైనా ఇలా చేస్తారా చెప్పండి.మరి ఈ దారుణ ఘటన గురించి అలాగే ఇలా మగాళ్లకు బుద్ది చెప్పాలని దారుణాలకు పాల్పడుతున్న మహిళల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.