3 సంవత్సరాల తర్వాత సమాధిలో నుండి బయటకు వచ్చిన భార్య..నమ్మకపోతే మీరే చూడండి

618

ఎవరికైనా చావు ఒకసారి వస్తుంది.పుట్టిన ప్రతి జీవి చస్తుంది.అయితే ఒక్కసారి చస్తే ఇక వాళ్లకు ఎలాంటి జీవితం ఉండదు.అయితే చనిపోయిన వ్యక్తి మళ్ళి బ్రతకడం సాధ్యమంటారా..! కానీ ఇటీవల చనిపోయిన వ్యక్తి నిద్రలేచి అరటిపండు తిన్నాడు..పాడె మీద నుంచి నిద్రలేచాడంటూ వచ్చిన వార్తలను చాలానే విన్నాం..టీవీ చానెళ్లలో చూస్తుంటాము కూడా. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన పై రెండింటి కంటే మరీ విచిత్ర ఘటన.ఒక మహిళా చనిపోయిన మూడేళ్ళ తర్వాత టీవిలో కనిపించింది.ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం.అదెలా సాధ్యమయ్యింది.ఆ విషయాల గురించి తెలుసుకుందాం.

Image result for burial ground

మొరాకోలో కాసాబ్లాంకాకి చెందిన అబ్రాగ్ మహ్మద్ భార్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. అప్రమత్తమైన భర్త అత్యవసర చికిత్సకై స్థానిక ఆసుపత్రికి తరలించాడు. శస్త్రచికిత్స చేసేందుకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పగా అతను నగదు కోసం బయటికెళ్లాడు. సుమారు నాలుగు గంటలు గడిచినా భర్త రాకపోవడంతో ఆగ్రహించిన ఆసుపత్రి యాజమాన్యం మీ భార్య చనిపోయిందని అప్పగించారు. భర్త కూడా అసలు చనిపోయిందా లేదా అని విషయాన్ని తెలుసుకోకుండానే మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే..భర్త డబ్బుల కోసం వెళ్లినప్పుడు డబ్బులు దొరుకుతుందో లేదో అని గ్రహించిన మహిళ ఆసుపత్రి నుంచి బయటికెళ్లిపోయింది. ఈవిషయాన్ని అక్కడ పనిచేసే వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం గ్రహించలేకపోయింది. వేరే మహిళ శవాన్ని మహ్మద్‌కు అప్పగించారు. ఈ విషయం తెలుసుకోలేక మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మొరాకోలో తప్పిపోయినోళ్లను కలుసుకునేందుకు మొరోకన్ టెలివిజన్‌ ప్రసారం చేస్తుంది.. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న మహ్మద్ భార్య చానెల్ ఆఫీసుకు ఫోన్ చేసి వివరాలు వెల్లడించింది. అయితే ప్రసారం చేసే సమయానికి భర్త చూడలేకపోయాడు. స్నేహితులు ద్వారా సమాచారం తెలుసుకున్న మహ్మద్ ఆశ్చర్యపోయాడు. ఆనందంతో గెంతులేశాడు. మూడు సంవత్సరాల వరకు ఆమె అజీలాల్ అనే చిన్నప్రాంతంలో తలదాచుకుని ఉంది. పైగా ప్రమాదం జరిగినప్పటి నుంచి కొన్నిరోజుల పాటు మహిళ జ్ఞాపకశక్తి కోల్పోయింది. భార్య ఇంటికి రావడంతో ఎప్పటిలాగే వారిరివురు జీవనం సాగిస్తున్నారు.ఇలా అతని జీవితంలో మళ్ళి ఆనందం వెల్లివిరిసింది.ఇదండీ చనిపోయిన మహిళ మళ్ళి బతికిరావడం వెనుక ఉన్న కథ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.చనిపోయిందనుకున్న ఈ మహిళ బతికి రావడం గురించి అలాగే ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న ఇలాంటి ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.