పక్కింటి యువకుడితో సరసాలు.. అడ్డొచ్చిన భర్తను చంపి 8 ముక్కలు చేసింది

224

ఇటీవలి కాలంలో స్త్రీపురుషుల మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి. దీనికి స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియుడు అని తేడా లేదు. శృంగార జీవితంలో ఏమాత్రం అసంతృప్తి ఉన్నా వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా పలు సందర్భాల్లో హత్యలకు కూడా దారితీస్తున్నాయి. దేశంలో అక్రమ సంబంధ మోజులో పడి కట్టుకున్న భర్తలను దారుణంగా చంపుతున్నారు భార్యలు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.ఇప్పుడు మరొక ఘటన జరిగింది. అయితే ఇప్పటివరకు ఏ భార్య కూడా చంపని విధంగా ఈ భార్య తన భర్తను చంపింది. మరి ఎలా చంపిందో ఎలా దొరికిపోయిందో పూర్తీగా తెలుసుకుందామా.

ఈ క్రింది వీడియో చూడండి

2006లో 50 ఏళ్ల రాజేష్ 25 ఏళ్ల వయసున్న సునీతను వివాహం చేసుకున్నాడు. ఆ మరుసటి ఏడాదే వారికి ఓ బాబు కూడా పుట్టాడు. గతేడాది ఈ జంట కొత్త ఇంటికి మారారు. కొద్ది రోజులకు సునీత పొరిగింట్లో ఉండే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, కొడుకులేని సమయం చూసి సునీత యువకుడితో సరసాలాడుతోంది. ఈ క్రమంలో భర్త తమ బంధానికి అడ్డొస్తాడని భావించిన సునీత అతడ్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. టీవీల్లో వచ్చే క్రైమ్ షోలు చూస్తూ భర్త హత్యకు స్కెచ్ వేసింది. ఫిబ్రవరి 14న భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. ఇంట్లో ఉన్న కొడుకును ఆడుకోమని పంపించి భర్తకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చింది. రాజేష్ గొంతు కోసి దారుణంగా చంపేసింది. తర్వాత మృతదేహాన్ని ఎనిమిది ముక్కలుగా నరికి తలను డ్రైనేజీలో వేసింది.

Image result for lovers

కాళ్లను ఇంటి ఆవరణలో, మిగతా భాగాలను తన బెడ్‌రూమ్‌తో పాటు, మిగతా ప్రాంతాల్లో పూడ్చిపెట్టింది. ఆ మరుసటి రోజు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసుల దగ్గర డ్రామాలాడింది. ఆమె చెప్పిన విషయాలు నిజమని నమ్మిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గతవారం సునీత గదిలో కుళ్లిపోయే స్థితిలో ఉన్న వేళ్లను ఇంటి యజమాని గమనించాడు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సునీతను ప్రశ్నించారు. దీంతో ఆమె తన భర్తను చంపినట్లు ఒప్పుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన సునీత భర్తను హతమార్చి జైలుపాలయ్యింది. ఇటు తల్లికి, తండ్రికి దూరమై బాలుడు అనాథగా మిగలగా పిల్లల ఆశ్రమంలో చేర్పించారు.చూశారుగా ఈ మహాతల్లి ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో. మరి భర్తను ముక్కలుగా చేసిన ఈ భార్య ఘటన గురించి అలాగే ఇలా అక్రమ సంబంధ మోజులో పడి కట్టుకున్న భర్తలను చంపుతున్న వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.