భార్య ప్రైవేట్ ఫోటోలను సోదరుడికి షేర్ చేశాడు..

373

ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప బంధాలలో భార్యాభర్తల బంధం గొప్పది.ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని వారితో జీవితాంతం జీవించాలి.ఈ మధ్య కొందరు ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారనుకోండి. అయితే కాపురం అన్నాక భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు వస్తుంటాయి. ఆ సమస్యలను బెడ్ రూమ్ లోనే మర్చిపోతే వారి బంధం చాలా బాగుంటుంది. వారి మధ్య ఉండే అనుబంధం ప్రేమ కొన్ని కోట్లతో సమానం.అయితే ఈ మధ్య భార్యాభర్తల మధ్య అది కనపడటం లేదు.ప్రతి దానికి కొట్టుకోవడం విడాకులు తీసుకోవడం లేదా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు విని విని చిరాకు లేస్తుంది అంటే ఇప్పుడు ఒక భర్త అందరికి షాక్ ఇచ్చే పనిని చేశాడు. మరి ఏం చేశాడో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for watching mobile

అబుదాబిలో నివసిస్తున్న భార్యాభర్తలు అన్యోన్యంగా జీవితాన్ని సాగించారు. ఇద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. అయినా కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమో అని అందరు అనుకునేలా వీరి బంధం ఉండేది. అయితే ఎవరి దిష్టి పడిందో ఏమో గాని ఆ భర్తకు చెడు బుద్ధి వచ్చింది. ఏ భర్త కూడా చెయ్యని దారుణానికి ఒడిగట్టాడు. ఎప్పుడు తీశాడో ఏమో కానీ భార్యను నగ్నంగా ఫోటోలు తీశాడు.వాటిని ఫోన్ లో భద్రపరచుకున్నాడు. భర్త ఇలా తనను ఫోటోలు తీశాడని ఆ భార్యకు తెలీదు. అయితే ఉన్నట్టుండి ఓ రోజు భార్య తన భర్త ఫోన్ చూసింది.మా ఆయన ఫోటోలు చూద్దామని గ్యాలరీ ఓపెన్ చేసిన ఆమెకు ఒక్కసారిగా షాక్ తగిలింది.

గ్యాలరీలో ఆమె ప్రైవేట్ ఫోటోలు వుండటాన్ని చూసి దిమ్మతిరిగినట్టు అయ్యింది. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామని ఫోన్ చెక్ చేస్తే ఆమెకు షాక్‌లపై షాక్‌లు తగిలాయి. తన ప్రైవేట్ ఫోటోలను తన భర్త అతడి సోదరుడికి ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేశాడు. అంతేకాకుండా చాలా సెక్సీగా ఉంది అని సోదరుడు రిప్లై ఇవ్వడం ఆమె గురించి ఇద్దరు చాటింగ్ చేసుకోవడం చూసి ఆమె కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎంతో మంచోడు అనుకున్న భర్త ఇంత దుర్మార్గుడా అని ఆ మహిళ కుమిలిపోయింది. వెంటనే ఆ షాక్ నుంచి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య ఫోటోలను సోదరుడికి పంపిన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే ఆ సోదరుడిని కూడా అరెస్ట్ చెయ్యాలనుకుంటున్నారు. చూశారుగా ఈ భర్త ఎంతటి నీచపు పనికి దిగాడో. మరి ఈ భర్త చేసిన నిర్వాకం గురించి అలాగే ఇలా నగ్న చిత్రాలను పంచుకునే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.