విడాకుల కోసం వాట్సప్ లో భార్య నగ్న ఫొటోలు పెట్టిన భర్త ఏం చేసాడో తెలిస్తే షాక్

427

భార్యాభర్తల సంబంధం చాలా గొప్పది.వారి మధ్య ఉండే అనుబంధం ప్రేమ కొన్ని కోట్లతో సమానం.అయితే ఈ మధ్య భార్యాభర్తల మధ్య అది కనపడటం లేదు.ప్రతి దానికి కొట్టుకోవడం విడాకులు తీసుకోవడం లేదా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చేస్తున్నారు.ఒకరంటే ఒకరికి నచ్చనప్పుడు విడాకులు తీసుకోవడం మంచి పనే.కానీ ఆ పద్ధతి సరైన క్రమంలో ఉండాలి.ఇప్పుడు ఒక భర్త చేసిన పని అందరి చేత ఛీ కొట్టించేలా ఉంది.వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని భార్య పరువు గంగపాలు చేశాడు ఈ ఘనుడు. భార్యతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను వాట్సప్ లో పెట్టడమే కాక, అసభ్యకరమైన వ్యాఖ్యలు జోడించారు. మరి తర్వాత ఏమైంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ఆలపాటి తులసీదాస్ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో బీబీఏ పూర్తి చేశాడు. ఇటీవలే వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తులసీదాస్ కు మౌనికతో పరిచయం ఏర్పడింది.ఎస్వీ యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీ చేసిన మౌనిక మనస్పర్థల కారణంగా భర్త నుంచి దూరంగా ఉంటుంది. ఒంటరిగానే జీవిస్తుంది.ఈ క్రమంలోనే ఇది వరకే పెళ్లి అయిన ఆలపాటి తులసీదాస్ తో మౌనిక కు హైదరాబాద్ లో జరిగిన సెక్యూరిటీ సర్వీసెస్ మీటింగ్ లో పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరు పెళ్లి చేసుకోకపోయిన సహజీవనం చేస్తున్నారు. ఇది తెలిసిన ఆలపాటి తులసీదాస్ భార్యకు గుండె పగిలినంత పనయ్యింది. ఆమె భర్తను ప్రశ్నించి ఆ తరువాత పోలీసులను ఆశ్రయిచింది.

కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ తరువాత బెయిల్ పై విడుదల అయ్యారు. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలనుకున్న తులసీదాస్.. ఆమె నగ్న ఫొటోలను వాట్సప్ లో ప్రియురాలు మౌనికకు షేర్ చేశాడు. ఆమె అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ పోస్ట్ చేసింది.వెంటనే విడాకులు కావాలంటే ఇదే సరైన మార్గమని భావించిన ఆలపాటి తులసీదాస్, మౌనిక ఈ ప్రణాళికకు తెరలేపారు. తన పరువు పోయిందని తులసీదాస్ భార్య కుమిలిపోతూ మరలా పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో పోలీసులు భర్తను, ఆయన ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఇలా భార్యను వదిలించుకునేందుకు ఏకంగా ఆమె నగ్న ఫొటోలను లీక్ చేసిన భర్త వ్యవహారం సంచలనం సృష్టించింది.చూశారుగా ఈ భర్త ప్రియురాలితో కలిసి ఎంతటి పని చేశాడో.