మ‌న దేశంలో భార్య‌ల‌ను అద్దెకిచ్చే గ్రామం ఇదే గంట‌కు ఎంతో తెలిస్తే నివ్వెర‌పోతారు

1197

మ‌న‌దేశంలో స్త్రీని ఎంతో పవిత్రంగా చూసుకుంటాం …కాని ఇప్పుడు ఆ ప‌రిస్దితి ఉన్న‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు..
స్త్రీని దేవతగా కొలుస్తామని గొప్పలు చెప్పుకుంటాం. కానీ, ఆ స్త్రీని అంగడి వస్తువుగా చేసి బేరం పెట్టిన ప్రబుద్ధులు పురాణ కాలంలోనే కాదు, 21వ శతాబ్దంలో కూడా ఉన్నారు. ఇప్పటికే స్త్రీ గర్భం వ్యాపార వస్తువుగా మారిపోయింది. కానీ నాలుగు డబ్బుల కోసం, జానెడు పొట్ట నింపుకోవడానికి అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్న భార్యను అద్దెకిస్తున్న భర్తల సంగతి తెలిస్తే సభ్యసమాజం విస్తుపోతుంది. కార్లు, బైకులు రెంట్‌కి ఇచ్చినట్టు భార్యలను అద్దెకిస్తున్న వైనం మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జరుగుతున్నా ఇక్క‌డ నోరువిప్పి ఎవరూ మాట్లాడరు.. అస‌లు ఈస్టోరీ ఏమిటో తెలుసుకుందా.

Image result for madhya pradesh wife rent

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో గ్వాలియర్ రాజపుత్రులుండే ప్రాంతం. ఇక్కడ నాలుగు పైసలు ఎక్కువున్న మగమారాజులకు ఒక అరుదైన సౌకర్యం అందుబాటులో ఉంది. వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు భర్తకు డబ్బులు ఎరగా చూపి నచ్చిన స్త్రీని అద్దెకు తెచ్చుకోవచ్చు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. అక్కడ సీజనల్‌గా ఏటా కొనసాగే ఈ సంప్రదాయం పేరు ‘దడీచ ప్రథ’. కొన్ని నెలలు, లేదా కొన్ని సంవత్సరాల పాటు భార్య పాత్రలో ‘ఉండడానికి’ అక్కడ వేలాదిమంది మహిళల్ని సిద్ధంగా ఉంచుతారు. షోరూమ్స్‌లో బొమ్మల్ని నిలబెట్టినట్లు.. ఈ ‘భార్యల మార్కెట్లో’ ఆడవాళ్ళని వరసలో నిలబెట్టిమరీ అద్దెకిస్తారు. పైగా ఇక్కడ జరిగే ఒప్పందాలకు చట్టబద్ధత కూడా ఉంది. 10 రూపాయల రెవెన్యూ స్టాంప్ పేపర్ల మీద ఈ డీల్‌ని సర్టిఫై చేస్తారు. అద్దెకాలంలో ఆ స్త్రీకి ఏమీకాకుండా చూసుకునే బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులదే! ఏ కారణం చేతనైనా అద్దెకు వెళ్ళిన స్త్రీ అనారోగ్యం పాలైతే అద్దెకు తీసుకున్న వ్యక్తి పూర్తిగా ఆ స్త్రీ బాధ్యతా వహించాలి.

Image result for madhya pradesh wife rentఈ తంతు మొత్తంలో ఒక్కటే షరతు ఉంటుంది. అదేమిటి అంటే అద్దెకు భార్యను తీసుకెళ్ళే వ్యక్తికి అప్పటికే ఒక భార్య ఉండకూడదు. భార్యలు లేనివారే అద్దెకు భార్యలను తీసుకెళ్ళేందుకు అర్హత కలిగి ఉంటారు. ఈ షరతును చాలామంది పాటించరు. భార్యలు ఉన్నవారు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి అద్దెకు భార్యలను తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకున్న అద్దె భార్యలు గనుక బాగా నచ్చితే.. కాంట్రాక్టు రెన్యు వల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో అయితే.. ఈ ‘భార్యల బజార్’ పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. పేదరికం లో ఉన్న‌వారు త‌మ భార్య‌ల‌ను రెన్యువ‌ల్ చేస్తూ ఉంటారు.ఈ ఆచారాం కొన్ని సంవత్సరాల పూర్వం నుంచే ఉంది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిర్ధారించడానికి .10 రూపాయ‌ల నుంచి 100 రూపాయ‌ల వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది.

ఇక్క‌డ మ‌రో దారుణ‌మైన విష‌యం అద్దెకు వెళుతున్న స్త్రీల మనోభావాలతో వీరికి పనిలేదు. రేటు కుదిరితే మరో మాట లేకుండా భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడి వెంట నిరభ్యంతరంగా పంపించివేస్తారు. గ్వాలియర్‌ ప్రాంతంలో భర్తలకు భార్యల మీద పూర్తి హక్కులుంటాయని నమ్ముతారు. ఒకసారి వివాహం జరిగితే తరువాత ఆ స్త్రీని భర్త ఏం చేసినా నోరు విప్పని సమాజం అది. వీరి ఆచార సంప్రదాయాల గురించి తెలిసిన పోలీసులు కూడా నోరు విప్పడానికి సాహసించరు. ఒక మహిళను ఎన్నిసార్లు ఎంతమంది అయినా అద్దెకు తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఆ స్త్రీని కొనుగోలు చేస్తారు కూడా..16 నుంచి 30 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న మ‌హిళ‌ల‌కు సంవ‌త్స‌రానికి ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌ల రూపాల‌య అద్దె ఉంటుంది ఇది వారి అందం బ‌ట్టీ ఉంటుంది..

అద్దెకాలం పూర్తి అయిన త‌ర్వాత ఆమెకు అక్క‌డే వ‌దిలేస్తారు.అద్దె సమయం పూర్తయిన తరువాత ఆ స్త్రీ గర్భం దాల్చినా, అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి బాధ్యత వహించడు… ఇక్క‌డ స్త్రీలు కూడా ఇలాంటి క‌ట్టుబాట్ల‌కు అల‌వాటుప‌డ్డారు.
ఇటీవ‌ల కొంద‌రు బాగా చదువుకుని ఇటువంటి వాటికిదూరంగా ఉంటున్నారు.గుజరాత్‌లోని నేట్రంగ్ ప్రాంతంలో కూడా ఇలాగే స్త్రీల‌ను అద్దెకిస్తూ ఉంటారు. ఇక వీరి మ‌ధ్య దళారులు ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తారు…చూశారుగా ఇలాంటి ప‌ద్ద‌తులు ఆచారాలు కొంద‌రు ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఈ అద్దె భార్య‌ల ఆచారం పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.