ఫ్రెండ్ భార్యతో ఆపని చూస్తుండగా వాళ్ళ యాంగిల్స్ కిటికిలోనుంచి చూసిన భర్త ఏం చేశాడో తెలిస్తేషాక్

711

ఇటీవ‌ల వివాహేత సంబంధాలు పెద్ద ఎత్తున బ‌య‌ట‌ప‌డుతున్నాయి అంతేకాదు ఇలాంటి వారి విష‌యంలో కుటుంబ స‌భ్యులు కూడా ఎంత నిలువ‌రించాలని చూస్తున్నా ఇవి అడ్డుక‌ట్ట ప‌డ‌టం లేదు. తాజాగా వివాహేతర సంబంధం ప్రాణాన్ని బలిగొంది. లంగర్‌హౌస్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోగల డిఫెన్స్‌ కాలనీలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి ఇంటిముందు పడేశారు. డిఫెన్స్‌ కాలనీకి చెందిన షేక్‌ ఇమ్రాన్ అనే వ్య‌క్తి వ‌య‌సు 26 సంవ‌త్స‌రాలు, అత‌ను స్ధానికంగా న‌గ‌రంలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తోటి డ్రైవర్‌గా పనిచేస్తున్న స్నేహితుడి భార్యతో అతడికి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో ఇమ్రాన్‌ను అంతమొందించాలనుకున్నాడు.

సోమవారం ఉదయం నుంచే అతడిని వెంటాడుతున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో లంగర్‌హౌస్‌ చౌరస్తాలో ఉన్న హోటల్‌లో టీ తాగేందుకు బావమరిది మహ్మద్‌ మసూద్‌తో కలిసి ఇమ్రాన్‌ వెళ్లాడు.. ప్రియురాలి భర్త అతడిని మూడో అంతస్తులో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి కత్తితో గొంతుపై దాడిచేసి చంపేశాడు…. మృతదేహాన్ని మెట్ల మార్గం ద్వారా కిందికి తీసుకొచ్చి ఇంటి ముందు పడేశాడు. ఇమ్రాన్‌ హత్య విషయం తెలుసుకున్న స్థానికులు 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఆరు నెలల క్రితమే ఇమ్రాన్‌కు వివాహం అయిందని, ఇంతలోనే హత్యకు గురయ్యాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. మధ్యాహ్నం టీ తాగేందుకు హోటల్‌కు వెళ్లాడని.. గంట వ్యవధిలోనే చంపేశారని తల్లి వాపోయారు. హత్యా ఘటన డిఫెన్స్‌ కాలనీ వాసులను కలిచివేసింది. త‌న భార్య‌తో అక్ర‌మ‌సంబంధం పెట్టుకున్నాడు అనే కోపంతో ఇమ్రాన్ ని చంపారు అని తెలుస్తోంది… అయితే ఇమ్రాన్ విష‌యంలో ఇంత‌క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం వీరి ఇద్ద‌రి మధ్య రిలేష‌న్ ఇటీవ‌ల పెరిగిపోయింది అని పెళ్లి అయినా ఇమ్రాన్ మార‌క‌పోవ‌డంతో ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పోలీసులు తెలుసుకున్నారు.