పెళ్లి అయినా సీక్రెట్ గా ల‌వ‌ర్స్ క‌లుసుకున్నారు అక్క‌డ ఏం జ‌రిగిందో తెలిస్తే .

481

కొంత‌కాలం ప్రేమించుకోవడం అవ‌స‌రం తీరాక వ‌దిలెయ్య‌డం ఇలాంటి సంఘ‌ట‌న‌లే ఇప్పుడు ఎక్కువగా జ‌రుగుతున్నాయి.. ఇక పెళ్లి అయిన తర్వాత ప్రియుడ్ని మ‌ర్చిపోలేక ఆ ప్రియుడితో రిలేష‌న్ కొన‌సాగించే అమ్మాయిలు ఉంటున్నారు.. ఇలా స‌మాజం మారిపోయింది. చాలా వ‌ర‌కూ అక్ర‌మ‌సంబంధాలు ఇలాంటివే జ‌రుగుతున్నాయి. తాజాగా ఓ యువ‌తి జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న అంద‌రికి క‌న్నీటిని తెప్పిస్తోంది.తాను టీటీసీ చదువుతున్న సమయంలో ఓ యువకుడితో సాగించిన ప్రేమ ఓ మహిళ హత్యకు దారితీసింది.

Image result for lovers in the park

వివాహమైన తర్వాత కూడా తనతో అక్రమం సంబంధం కొనసాగించాలంటూ ఆ యువకుడు పట్టుబట్టాడు, అందుకు ఆ మహిళ నిరాకరించింది. దీంతో ఏకాంతంగా ఒక్కసారి మాట్లాడాలని చెప్పడంతో ఆ మహిళ అతని వెంట వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు వివాహితను హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ ఘ‌ట‌న‌.. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రానికి చెందిన విజయలక్ష్మికి అనంతపురం గణేష్‌ నగర్‌కు చెందిన బాలాజి అనే వ్యక్తితో గత మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆమె విజయ పబ్లిక్‌ స్కూల్లో టీటీసీ చదువుతోంది.

Image result for lovers in the park

ఉపాధ్యాయ దినోత్సవం రోజున విజయ పబ్లిక్‌ స్కూల్లో పంక్షన్‌కు వెళున్నట్లు ఇంటివద్ద చెప్పి తిరిగిరాలేదు. దీంతో ఆమె భర్త బాలాజి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ పరిస్థితుల్లో శివరాంపేట సమీపంలోని పొలాల్లో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆ శవం తన భార్యదేని బాలాజీ నిర్ధారించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడైంది.

విజయలక్ష్మి టీటీసీ చదువుతున్న సమయంలో తన తోటి విద్యార్థి కళ్యాణదుర్గంకు చెందిన ఓ యువకుడితో ప్రేమలోపడింది. అదికాస్త వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసి పెళ్లయిన తర్వాత కూడా కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విజయలక్ష్మిని పొలాల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.దీంతో ఆ భ‌ర్త క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.. ఇంత ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకుంటే బాగుండేది అని, చివ‌ర‌కు ఆ అమ్మాయిని ఇలా చంపెయ్య‌డం పై ఆ భర్త కూడా నిల‌దీస్తున్నాడు. ఇరుకుటుంబాల్లో ఈ హ‌త్య తీవ్ర విషాదం మిగిల్చింది. చూశారుగా ప్రేమ చివ‌ర‌కు ఎంత దారుణానికి ఒడిగ‌ట్టేలా చేసిందో.