భార్య ఆ పని చేసిందని చేసుకున్న భర్త ఇంతకు భార్య ఏం చేసిందో తెలిస్తే దిమ్మతిరుగుతుంది

682

ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప బంధాలలో భార్యాభర్తల బంధం గొప్పది.ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని వారితో జీవితాంతం జీవించాలి.ఈ మధ్య కొందరు ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారనుకోండి. అయితే కాపురం అన్నాక భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు వస్తుంటాయి. కొన్నివిషయాల్లో భర్త, మరికొన్ని విషయాల్లో భార్య సర్దుకుపోతే సమస్యలు వాటంతట అవే సమసిపోతాయి. కానీ అలా సర్దుకుపోకుండా ఈ మధ్య చాలా మంది భార్య భర్తలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు.కొందరు అయితే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని సంసారాన్ని బజారున పడేసుకుంటున్నారు.ఇలా తన భార్య చేసిందనే ఒక భర్త బలవన్మరానికి పాల్పడ్డాడు. అసలేమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for lovers
హైదరాబాద్ విజయ్ నగర్ కాలనీలో నివసించే విజయబాబు,రాణి పెద్దల్ని ఎదిరించి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు భార్య కోసం విజయ బాబు తన పేరును ప్రభువుగా మార్చుకున్నాడు. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వినోష్ అనే కుమారుడు జన్మించాడు.కొంతకాలం అన్యోన్యంగానే సాగిన కుటుంబంలో కలతలు రేగాయి. కుమారుడు వినోష్‌ను భర్త వద్దే వదిలిపెట్టి నాలుగు రోజుల క్రితం పుట్టింటికెళ్లింది రాణి. అప్పటి నుంచి ప్రభువు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. నాలుగో తరగతి చదివే కుమారుడు వినోష్ ట్యూషన్‌కు వెళ్తానని చెప్పినా ప్రభువు వద్దని వారించాడు. కుమారుడికి చివరిసారిగా అన్నం ముద్దలు కలిపి పెట్టి తినిపించాడు. బాబు వినోష్‌ను నిద్రపుచ్చాడు. ఆ తర్వాత ఇంట్లో హాల్లోని ఇనుప కొక్కేనికి చీరతో మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు ప్రభువు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇరుగుపొరుగు గమనించి తలుపు బాది వినోష్‌ని నిద్రలేపారు. కుమారుడు వినోష్ కళ్లు తెరిచి చూసేసరికి షాక్.. తండ్రి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించేసరికి గుండెలవిసేలా రోదించాడు ఈ పసివాడు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేవారని భర్తని వదిలి ఆమె పుట్టింటికి వెళ్లిందని చెప్తున్నారు మృతుని బంధువులు. రెండ్రోజుల క్రితం నల్లకుంట పోలీసుస్టేషన్లో భర్త ప్రభువుపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందని దాంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని చెప్తున్నారు. రాణికి తన బావతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబీకులు. నాన్న ఉరేసుకుని చనిపోయాడంటూ ఎనిమిదేళ్ల బాబు వినోష్ బంధువులందరికీ ఫోన్లు చేయడంతో ఇంటి వద్ద తీవ్ర విషాదం అలుముకుంది. సూసైడ్ నోట్ కూడా లభించలేదని మృతికి కారణాలేంటనేది దర్యాప్తులో తేలుతుందని చెప్తున్నారు పోలీసులు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. భార్య కేసు పెట్టిందని సూసైడ్ చేసుకున్న ఈ భర్త ఘటన గురించి అలాగే ఇలా వివిధ కారణాల ఒకరి చావుకు మరొకరూ కారణం అవుతున్న భార్యాభర్తల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.