ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ మహిళ గురించి పూర్తీగా తెలిస్తే దిమ్మతిరుగుతుంది

271

మేడి పండు చూడు మేలిమి ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని. ఎప్పుడైనా సరే ముఖాన్ని చూసి మోసపోకూడదు. మగాళ్ళలోనే కాదు మహిళల్లోనూ సాడిస్ట్ లు, సైకో లు ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహిళ ఎంతో అమాయకంగా కనిపిస్తోంది కదూ. కానీ ఈమె చేసిన పని తెలిస్తే ఎవరికైనా ఉప్పు పాతరేయాలనిపిస్తుంది. ఇంతకు ఏం చేసిందా అని అనుకుంటున్నారా.. చెబుతా వినండి.బెంగళూరు లోని నెలమంగళ లో పాండురంగ అనే అతనికి , మంజులతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరు అయిదు సంవత్సరాల పాటు గాఢంగా ప్రేమించుకొని పెళ్ళి చేసుకొన్నారు. ఆ తరువాత 17 సంవత్సరాలుగా వైవాహిక బంధంలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ స్థానికంగా ఉండే గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూన్నారు.

Image result for wife and husband

ప్రశాంతమైన వీరి జీవితంలోకి కొద్ది రోజుల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి కొత్తగా ఆ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో చేరి మంజులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా ఘాటు ప్రేమగా మారింది. ఈ ఘాటు మత్తులో ఉన్న వీరిద్దరికి పాండురంగ అడ్డుగా ఉన్నాడు. దీంతో ఎలా అయినా సరే అతన్ని చంపాలని ఫిక్స్ అయిపోయారు. అందుకు సంబంధించి ఎన్నో ప్లాన్స్ ను ఫోన్ లో మాట్లాడుకున్నారు. పథకం అమలు చేయడానికి మంజుల అనుకోకుండా ఫోన్ వదిలేసి బయటకు వెళ్ళింది. ఇంట్లో ఉన్న ఫోన్ కదా అని అందులో ఉన్న వాయిస్ కాల్స్ రికార్డింగ్ ను పాండురంగ విన్నాడు.అంతే ఒక్కసారిగా గుండె లో అణుబాంబు పేలినంత పనైంది.ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అంత ఘాతుకానికి ఒడిగడుతుందని ఊహించలేదు పాండురంగడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అందులో ఆమె భర్తను చంపడానికి సుపారీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం భర్తకు తెలిసిపోయిందని భావించిన మంజుల, శ్రీనివాస్ తో పరారయింది. దీనిపై పాండురంగ మాదనాయకనహళ్ళి పోలీస్ స్టేషన్ లో వారిద్దరిపై ఫిర్యాదు చేశాడు. తనకు తన పిల్లలకు రక్షణ కల్పించాలని కోరాడు.. తనను చంపేస్తే ఇద్దరు పిల్లలూ అనాథలు అయిపోతారని నేను పోయిన పర్వాలేదు, అభం శుభం తెలియని నా పిల్లల్ని చంపేయాలనుకోవడం తట్టుకోలేకపోతున్నాని పోలీస్ లకు మొరపెట్టుకున్నాడు. దాంతో పోలీసులు రక్షణ కల్పించారు. చూసారా ప్రేమించి ఎంతటి ఘాతుకానికి ఒడి గట్టిందో.కామాన్ని, ఆకర్షణ ను అదుపులో పెట్టుకుంటేనే ఇలాంటివి ఇక మీదట జరుగవు.కాబట్టి ఇలాంటి దారుణాలకు పాల్పడే ముందు ఒకసారి ఆలోచించండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. భర్తను చంపడానికి ప్లాన్ చేసిన ఈ భార్య గురించి అలాగే ఈ మధ్య ప్రియుళ్ల కోసం కట్టుకున్న భర్తలను చంపుతున్న వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.