బావతో పని కానిస్తూ అడ్డంగా దొరికిపోయిన భార్య.. చివరికి ఏమైందో తెలుసా..

480

గతంలో ప్రేమించలేదని ప్రియురాలి పైన యాసిడ్ పోసిన ప్రియుడు, ప్రేమించలేదని కత్తితో ప్రియురాలిని చంపినా ప్రియుడు లాంటి వార్తలు చేసేవాళ్ళం కాని ఇప్పుడు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్యలు చెయ్యడం కామన్ అయిపోయింది. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హతమార్చిన జాబితాలో మరో మహిళ చేరింది.మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for wife and husband

గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య (24) తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర (27)కు శ్రీవిద్య అనే యువతితో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది.కానీ శ్రీవిద్య పెళ్లి కాక ముందు నుంచే తన బావ గొట్టిపాటి వీరయ్య చౌదరితో శారీరక సంబంధం పెట్టుకుంది. శ్రీవిద్య తనకు పెళ్లైన తర్వాత కూడా బావ వీరయ్యతో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం కాస్త నరేంద్రకు తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు వాగ్వాదం తలెత్తింది. పద్ధతి మార్చుకోవాలంటూ నరేంద్ర తన భార్యను హెచ్చరించాడు. మారినట్టే నటించిన శ్రీవిద్య.. భర్తను కడతేర్చడానికి బావతో కలిసి కుట్ర పన్నింది.శ్రీవిద్య తన బావ తో కలిసి వేసిన ముందస్తు ప్రణాళిక ప్రకారం శ్రీవిద్య తన భర్త వద్ద కపట ప్రేమ ఒలకబోసింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత.. గత డిసెంబర్‌ 19న మద్యం అంటే మక్కువ చూపే తన భర్తకు మందులో సైనైడ్ కలిపి తాగించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో అతడు దుర్మరణం పాలయ్యాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించింది. బావ వీరయ్యతో కలిసి శ్రీవిద్య తన భర్త నరేంద్ర మృతదేహాన్ని తీసుకెళ్లి పునుగుపాడు వద్ద కాలువలో పడేసింది.కుటుంబ కలహాల వల్ల కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది. అయితే శ్రీ విద్య ప్రవర్తన పై మొదటి నుండి అనుమానం కలిగిన నరేంద్ర తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవిద్య కాల్ డేటా ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. తన భర్త అడ్డు తొలగించుకుంటే బావతో యథేచ్ఛగా సంబంధం కొనసాగించవచ్చని భావించిన శ్రీవిద్య ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితురాలికి ఆమె బావ వీరయ్యే అత్యంత గోప్యంగా సయనైడ్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. వీరయ్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులు.. గుంజి బాలరాజు, పూజల చౌడయ్యను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న శ్రీవిద్య కోసం గాలిస్తున్నారు.చూశారుగా ఈ భార్య ఎంతటి పని చేసిందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. బావ కోసం కట్టుకున్న భర్తను చంపిన ఈ భార్య ఘటన గురించి అలాగే సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఈ అక్రమ సంబంధ హత్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.