భార్య పై అనుమానంతో ప‌క్కింట్లో భ‌ర్త ఏం చేశాడో తెలిస్తే ఇత‌నేం భ‌ర్త అంటారు

278

ఇటీవ‌ల పెళ్లిళ్లు అయిన చాలా జంట‌లు అనుమానం అనే పెనుభూతంతో, త‌మ బంగారు జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు అని, అంటున్నారు పోలీసులు, చాలా కేసులు ఇలాంటి అనుమానం అలాగే అద‌న‌పు క‌ట్నాలు అధ‌న‌పు డ‌బ్బు తీసుకురాలేదు అని హ‌త్య‌ల‌కు తెగ‌బ‌డుతున్నారు అని పోలీసులు తెలియ‌చేస్తున్నారు. తాజాగా ఇలాంటి దారుణం జ‌రిగింది బిహార్ లో.కట్టుకున్న భార్యపట్ల కసాయిగా మారాడో భర్త. భార్యను దారుణంగా చంపేసి.. మృతదేహాన్ని తాను ఉంటున్న ఇంటి యజమాని మంచం కింద దాచేశాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. గమనించిన యజమాని మహిళ మృతదేహం చూసి షాక్ తిన్నాడు. గుర్గావ్‌లో జరిగిన ఈ దారుణం ఐదు రోజుల తర్వాత బయటపడింది.

 

బీహార్‌లోని గయకు చెందిన రాజేష్ గుర్గావ్‌లో దినేష్ కుమార్ అనే వ్యాపారి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జలవిహార్‌ కాలనీలోని సెక్టార్‌ 36లో అతడు తన భార్య బబితతో కలిసి యజమాని ఇంటి ఎదురుగా ఉన్న ఓ పోర్షన్‌లో ఉంటున్నాడు. ఈ నెల 21న దినేష్ కుమార్ ఊరు వెళ్లి రెండు రోజుల క్రితం తిరిగొచ్చాడు. రాజేష్ ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. అతడి మొబైల్‌కు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.దినేష్ కుమార్ తన ఇంటి తలుపులు తీయగానే.. ఇంట్లో నుంచి దుర్వాసన వచ్చింది. ముందు ఎలుక చచ్చిందని భావించి పట్టించుకోలేదు. శనివారం ఆ వాసన భరించలేనంతగా రావడంతో అనుమానం వచ్చింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వెంటనే తన మంచంపై ఉన్న ప్లై ఉడ్‌ను ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నాడు. ఆ బాక్స్‌లో బబిత మృతదేహాన్ని చూశాడు. గత రెండు మూడు రోజులుగా ఆ బెడ్‌పైనే పడుకున్నానని తలుచుకొని వణికిపోయాడు.దినేష్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. బబితను రాజేష్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి గాలింపు మొదలు పెట్టారు. మరోవైపు తన కుమార్తెను రాజేష్ చంపాడని బబిత తండ్రి కూడా ఆరోపిస్తున్నారు. మ‌రి అద‌న‌పు క‌ట్న‌మా అనుమాన‌మా అనే విష‌యం పై పోలీసులు విచారణ చేయాల్సి ఉంది.