భ‌ర్త అందంగా లేడు అని ఈ భార్య ఎంత దారుణం చేసిందో తెలిస్తే షాక్…

482

ఆలుమగలన్నాక జగడాలు సాధారణమే. అలకలు ఓ కొలిక్కి వస్తేనే అందం. అలాకాకుండా చిలికి చిలికి గాలివానలా మారితేనే అసలు సమస్యంతా. మాయాబజార్‌లో పింగళివారన్నట్టు కలహం అంటే ప్రణయ కలహంగా భావిస్తే సంసారం హాయిగా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య చికాకులు కలిగించే విషయాలు ఎన్ని ఉంటాయో.. వాటిని అధిగమించే అవకాశాలూ అన్నే ఉంటాయి. అవి పాటిస్తే చాలు మీ అనుబంధం మరింత బలపడుతుంది. కాని కొంద‌రు ముద్దు ముచ్చ‌ట కూడా చాలా స‌ర‌దాగా చేయాల్సింది కాస్త ఇబ్బందులు ప‌డేలా చేసుకుంటారు.. అలాగే ముద్దు ముచ్చ‌ట తెలియ‌ని వారు కూడా ఈ స‌మాజంలో ఉంటారు.. ఎప్పుడెలా బిహేవ్ చేయాలి అనేది తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు.. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న ఇప్ప‌డు జ‌రిగింది..

Image result for boys depressionఆలుమగల ముద్దు సరసం కాస్త వికటించి, భర్త నాలుకకే ఎసరు తెచ్చింది. భార్యకు ఇష్టం లేకుండా పెట్టిన ముద్దు చివరకు భర్తను ఆస్పత్రిపాలు చేసింది. సగం తెగిన నాలుకతో ప్రస్తుతం అతగాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలో జ‌రిగింది. పోలీసులు కథనం ప్రకారం… ఔటర్ ఢిల్లీకి చెందిన ఆర్టిస్ట్ కరణ్‌కు రెండేళ్ల క్రితం వివాహం అయింది. అయితే పెళ్లి అయిన దగ్గర నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

Related image

భర్త అందంగా లేడనే కారణంగా భార్య ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ, గొడవ పెట్టుకునేది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి అయిన ఆమె… శనివారం కూడా భర్తతో ఘర్షణకు దిగింది. అయితే భార్య కోపాన్ని చల్లార్చేందుకు కరణ్… ఆమెకు బలవంతంగా ముద్దుపెట్టాడు. అసలే కోపం మీద ఉన్న భార్యకు భర్త చర్యకు తిక్కరేగింది. అంతే భర్త ముద్దుపెట్టుకుండగా అతగాడి నాలుకను కసితీరా కొరికేసింది. దీంతో కరణ్ నాలుగ సగం మేర తెగిపడింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో కరణ్‌ను కుటుంబసభ్యులు హుటాహుటీన సర్థార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు, వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయితే కరణ్ స్పష్టంగా మాట్లాడేది కష్టమే అని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కరణ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కరణ్ భార్యపై ఐపీసీ సెక్షన్ 326 కింద కేసు నమోదు చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువు అయితే ఆమెకు శిక్షపడే అవకాశం ఉంది.కాని అత‌ను మ‌త్రం భార్య‌పై ఎటువంటికేసు పెట్ట‌ద్దు అని చెబుతున్నాడు త‌న‌కు ఆమె అంటే ఇష్టం అని అంటున్నాడు కాని అతని కుటుంబ స‌భ్యులు మాత్రం ఆమెకు శిక్ష‌ప‌డాలి అని అంటున్నారు మ‌రి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.