ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసిన భార్య భ‌ర్త చేసిన ప‌ని తెలిస్తే షాక్

324

నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు హెచ్చుమీరుతున్నాయి. తాత్కాలిక సుఖం కోసం జీవిత భాగస్వాములను మోసం చేయడం, ప్రాణాలు తీయడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఇదే కోవలో వివాహేతర సంబంధం నెరుపుతున్న భార్య, ఆమె ప్రియుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త వారిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా, ఆమె ప్రియుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

Image result for LOVERS

చేవెళ్ల అంబేడ్కర్‌ కాలనీకి చెందిన భాగ్యలక్షి కి కొన్నేళ్ల క్రితం మండల పరిధిలోని దామరిగిద్ద గ్రామానికి చెందిన రవితో వివాహం జరిగింది. భార్యాభర్తలు బతుకుదెరువు కోసం అంబేడ్కర్‌ కాలనీలోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భాగ్యలక్ష్మి కొద్దిరోజుల నుంచి స్థానికంగా ఉండే ఉమర్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ విషయం తెలిసిన రవి భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకోని భాగ్యలక్ష్మి అక్రమ సంబంధాన్ని కొనసాగుతూ వస్తోంది. శనివారం రాత్రి భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని ఏకాంతంగా గడపసాగింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన రవి.. వారిద్దరినీ చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే బైక్‌లోని పెట్రోల్ తీసి వారిద్దరిపై చల్లి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో భాగ్యలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఉమర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వీరు గతంలో నగరంలోని రైతుబజార్‌లో కూరగాయలు విక్రయించేవారని. హిమాయత్‌సాగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఉమర్‌తో రవికి పరిచయం ఏర్పడింది అని . అతను కూడ రవి ఇంటికి వచ్చేవాడని . ఈ క్రమంలో భాగ్య, ఉమర్‌ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పలుసార్లు రవి వారిని మందలించాడు అని ఇక్క‌డ వారు చెబుతున్నారు. మొత్తానికి ఇలా భార్య చ‌నిపోవ‌డంతో పిల్ల‌లు అనాధ‌ల‌య్యారు, మ‌రిచూశారుగా జీవితంలో చేసే త‌ప్పిదాలు ఎలాంటి దారుణాల‌కు కార‌ణం అవుతాయో.