రాత్రి వేళ భార్య,భర్తలు చేయకూడని 11 ఖచ్చితమైన పనులు

958

ఈ మ‌ధ్య కాలంలో భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఉద్యోగాలు చేయ‌డం కామ‌న్ అయిన విష‌యం… ప‌గ‌లంతా ఆఫీసులో అల‌సిపోయి, రాత్రి అయ్యేస‌రికి ఇంటికి చేరుకుంటారు.. దీంతో ఎవ‌రి ప‌ని వారిదే అనేలా బిజీ బిజీగా ఉంటారు.. చివ‌రకి ఇద్ద‌రికి ఆఫీసులో ప‌ని ఒత్తిడితో రాత్రి అల‌సిపోయి ప‌డుకోవాలి అని భావిస్తారు.. ఇక కొంద‌రు ఉద్యోగులు ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఆఫీసు ప‌నే చేస్తూ ఉంటారు… ఇక మ‌రింత చికాగు పుట్టించే అంశం ఒక‌రిది ప‌గ‌లు ఉద్యోగం అయితే మ‌రొక‌రిది రాత్రి ఉద్యోగంగా ఉంటుంది బార్య భ‌ర్త‌లకు.. . దీంతో ఇద్ద‌రూ కూడా ఉద్యోగాల‌తో బిజీగా ఉండి త‌మ లైఫ్ ని స‌రిగ్గా లీడ్ చేసుకోలేరు.. చివ‌రికి ఎవ‌రికి వారు బిజీగా ఉండ‌టంతో ఒక‌రిని ఒక‌రు ప‌ట్టించుకోలేనంత‌గా మారిపోతారు ఇవే కాపురంలో గొడ‌వ‌ల‌కు దారితీస్తాయి.. దంప‌తులు ఇద్ద‌రూ మ‌న‌సు విప్పి మాట్లాడుకుంటేనే ఇద్ద‌రికి జీవితం అన్యోన్యంగా ఉంటుంది.. ఇక రాత్రివేళ భార్య‌భ‌ర్త‌లు ఎలా ప్ర‌వ‌ర్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ 11 త‌ప్పులు చేయ‌కుండా ఉంటే మంచిది అని చెబుతున్నారు కౌన్సిలింగ్ ఇచ్చే డాక్ట‌ర్లు, ఓసారి అవేంటో కూడా తెలుసుకుందాం..

స్మార్ట్ ఫోన్లు ఈ మ‌ధ్య ఉద‌యం లేచిన స‌మ‌యం నుంచి, రాత్రి వ‌ర‌కూ వీటిని చూస్తూ ఉండ‌టం వ‌ల్ల, మీ శ‌రీరంలో యాక్సిటోక్సిన్ విడుద‌ల‌ను అణిచివేస్తుంది..ఈ హార్మోన్ విడుద‌ల అయితే మీ బంధం మ‌రింత బ‌ల‌ప‌డ‌టానికి సాన్నిహిత్యంగా ఉండ‌టానికి ఇది మ‌రింత బ‌ల‌ప‌డేలా చేస్తుంది.

Image result for wife and husband indian

ఇద్దరూ ప‌డుకునే ముందు క‌లిసిచేసే పనులు మీ జీవితానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.. క‌లిసి టీవీ చూడ‌టం, క‌లిసి భోజ‌నం చేయ‌డం, క‌లిసి మాట్లాడుకోవ‌డం వ‌ల్ల మీ ఇద్ద‌రికి వివాదాలు రావు.

ఇక ఒక‌రి ఫీలింగ్స్ ని మ‌రొక‌రు గౌర‌వించుకోవాలి.. ఒక‌రి ఫీలింగ్స్ ని మ‌రొక‌రు గౌర‌వించుకోవ‌డం వ‌లన, వారి ప‌ట్ల మ‌నం ఎంత కేర్ చూపిస్తున్నామో, ఎదుటి వారికి అది తెలుస్తుంది… బెడ్ రూమ్ లోకి, అడుగుపెట్టాక ఇద్ద‌రి స‌మ‌స్య‌లు అక్క‌డే వ‌దిలి వెయ్యాలి.

నిద్ర‌పోవ‌డానికి ముందు జంట‌లు, ఒక‌రికి ఒక‌రు మ‌సాజ్ చేసుకోవ‌డం వ‌ల‌న ఇద్ద‌రికి ఒత్తిడి త‌గ్గుతుంది.. మ‌రింత బంధం బ‌ల‌ప‌డుతుంది.. ఇలా చేయ‌డం వ‌ల‌న ఎటువంటి స‌మ‌స్య‌లు మీ కాపురంలో రాకుండా ఉంటాయి.

ఇక ప‌డుకునే ముందు ఆల్కాహాలు తీసుకోవ‌డం, సిగార్ కాల్చ‌డం, గుట్కా, జ‌ర్దా, తీసుకోవ‌డం మానేయాలి.. ఇలాంటి అల‌వాట్లు మీ ఆరోగ్యం పై ఎఫెక్ట్ చూపిస్తాయి.. ఇక ఆరోగ్యం పై అవి ఎంతో ఎఫెక్ట్ ప‌డేలా చేస్తాయి.. అలాగే ఆల్కహ‌ల్ కూడా ఆమె తీసుకోవద్ద‌ని చెప్పినా మీరు మాన‌రు ఇది ఇద్ద‌రి మ‌ధ్య‌ మ‌రింత ద్వేషం పెరిగేలా చేస్తుంది.

ఇద్ద‌రూ ఒకే సారి ప‌డుకోవ‌డానికి ట్రై చేయండి. కాపురంలో క‌ల‌హాలు రాకుండా ఉండ‌టానికి ఇది చాలా మంచిది.. భ‌ర్త ప‌నిలో ఉంటే భార్య నిద్ర‌పోవ‌డం, అలాగే భార్య కిచెన్ లో ఉంటే భ‌ర్త పడుకోవ‌డం చేస్తూ ఉంటారు.. దీని వ‌ల్ల ఇద్ద‌రికి మ‌రింత గ్యాప్ పెరుగుతుంది. అందుకే కాసేపు ఇద్ద‌రూ మాట్లాడుకుని ఇద్ద‌రూ ఒకే టైమ్ కు ప‌డుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి.

Image result for indian wife and husband having meals

మ‌న‌స్పర్ద‌లు ఇద్ద‌రి మ‌ధ్య వ‌స్తే అవి బెడ్ రూమ్ వ‌ర‌కూ తీసుకురాక‌పోవ‌డ‌మే మంచిది.. ఇద్ద‌రికి గొడ‌వ అయ్యే అంశాలు ప‌డుకోవ‌డానికి ముందు చ‌ర్చించ‌క‌పోవ‌డం అలవాటు చేసుకోవాలి.. ఆ స‌మ‌యంలో ఈ విష‌యాలు మాట్లాడ‌క‌పోతే మ‌రుస‌టి రోజు ఆ గొడ‌వ త‌గ్గే అవకాశం ఉంటుంది…. లేదా మ‌రింత గొడ‌వ‌ల‌కు కార‌ణం అవుతుంది.

నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తే ప‌ని గురించి మ‌ర్చిపోవాలి. రాత్రి ప‌డుకునే స‌మ‌యంలో భార్య‌తో బాగా మాట్లాడాలి.. ఉద‌యం ఫోన్లు ఎత్తి ల్యాప్ ట్యాప్ ముందు పెట్టుకుని ఆఫీసు ప‌నిని మొద‌లుపెట్టకూడ‌దు.

పిల్ల‌లు పుట్టాక భార్య భ‌ర్త‌లు మ‌రింత దూరం అవ్వ‌కండి, పిల్ల‌ల‌కి వేరే రూము అల‌వాటు చెయ్యాలి.. అప్పుడే వారు స్వతంత్య్రంగా ఉండే అలవాటు నేర్చుకుంటారు.

ఇక ప‌డుకునే ముందు క‌లిశాము వాంచ తీరింది ప‌డుకున్నాం అనేది కాకుండా, ఆమె త‌ల‌నిరుముతూ ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే ఆ స‌మ‌యంలో అడ‌గాలి ఆమెకు ఓ కౌగిలింత ఇచ్చి ప‌డుకోవాలి.

ఇక పెంపుడు జంతువుల‌తో ప‌డుకుంటే 65 శాతం మందికి నిద్ర ఉండ‌టం లేదు అని తేలింది.. ఈ స‌మ‌స్య ఉండ‌కూడ‌దు అంటే వాటిని ప‌క్క‌న పెట్టి ఇద్ద‌రూ క‌లిసి నిద్రించండి ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే లైఫ్ బాగా లీడ్ చేయ‌వ‌చ్చు.. చూశారుగా ఇలాంటి టెక్నిక్స్ పాటించి జీవితంలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లండి.. ఈ వీడియో పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.