భార్యభర్తల రొమాంటిక్ లైఫ్ బాగుంటాలంటే ఏం చేయాలి ? ఇద్దరూ తప్పక చూడాల్సిన వీడియో.

190

భార్యాభర్తల బంధం ఎప్పటికి దృడంగా ఉండాలంటే వారి మధ్య మంచి శృంగార బంధంతో పాటు అప్పుడప్పుడు కౌగిలింతలు ముద్దులు ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడం తియ్యని మాటలు కైపెక్కించే చూపులతో పాటు మరెన్నో విషయాల మీద ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపించడం అవసరం. మీ మధ్య దృఢమైన బంధాన్ని పెంచే 8 విషయాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for wife and husband

ప్రేమికులకు తమ ప్రేమ సఫలం అవ్వాలని ఉంటుంది. భార్యాభర్తలకు తమ బంధం దృడంగా ఉండాలని ఉంటుంది. మనసులో అలా ఉన్నంతమాత్రాన బంధాలు దృడంగా ఉండవు. అందుకు తగినట్టుగా భాగస్వాములు ఉండాలి. ఒకరిని ఒకరు వీడకుండా ఉండాలి. ఒకరి ఇష్టాలను మరొక షేర్ చేసుకోవడంతో పాటూ మంచి అలవాట్లను చేసుకోవడం వలన వారి బంధం మరింత గట్టిగా ఉంటుంది.

  1. శారీరక స్పర్శ….రొమాంటిక్ లైఫ్ బాగుండాలంటే శారీరక స్పర్శ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే కౌగిలింత ముద్దులతో రొమాంటిక్ లైఫ్ విడదీయనిగా ఉంటుంది.శారీరక స్పర్శ అనేది మీ ప్రేమను మీ కేరింగ్ ను మీ సపోర్ట్ ను తెలియజేయడానికి సరైన మార్గం. అందుకే సమయం ఉన్నప్పుడల్లా పాట్నర్ ను ముద్దు పెట్టుకోడానికి హగ్ చేసుకోడానికి సంకోచించవద్దు.
  2. మనసు విప్పి మాట్లాడుకోవడం.. ఒకరి గురించి మరొకరికి తెలియాలంటే మాటలే వారధి. ఇది ఒకరి మీద మరొకరికి ప్రేమ కలిగి అర్థం చేసుకోడానికి దోహదం చేస్తుంది.అంతేకాకుండా ఇద్దరి మధ్య ఏమైనా అపోహలు ఉన్నా అవి తొలగిపోతాయి .అందుకే మనసు విప్పి మాట్లాడాలని అంటారు పెద్దలు.

ఈ క్రింది వీడియో చూడండి

  1. కొత్తమార్గం వెతకడం….. పాట్నర్ ను ఆనందింపజేయడం కోసం ఇప్పుడునా కొత్త మార్గాన్ని వెతకడం వారికి సర్ప్రైజ్ ఇస్తుంది.మీ లవ్ లైఫ్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఇది రొమాంటిక్ రిలేషన్ షిప్ ను బలంగా చేస్తుంది. కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్ళండి కొత్త విషయాలను డిస్కస్ చెయ్యండి. అప్పుడు మీ మధ్య బంధం బలపడుతుంది.
  2. మనస్పర్థలు…. ఏ జంటలో అయినా మనస్పర్థలు సహజం. కానీ కొంతమంది మాత్రమే దానిని ఆరోజుతో మర్చిపోతారు. అలా ఉంటె వారి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుంది అని అంటారు. కాబట్టి ఎవరిదీ తప్పయిన సర్థుకుపోండి. పగలు గొడవ రాత్రితో సమసిపోవాలి. అభిప్రాయభేదాలు ఉంటె కూర్చుని చర్చించుకోండి.
  3. ప్రశంస….. ప్రశంస అనేది ఎలాంటి వ్యక్తిని అయినా ఉత్తేజితుల్ని చేస్తుంది. మీ పాట్నర్ ను వీలైనప్పుడల్లా ప్రశంసించండి. ఆ ప్రశంస అనేది నమ్మేట్టు ఉండాలి. ప్రశంస ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఆమె డ్రెస్ లో అందంగా ఉంటె అద్భుతంగా ఉన్నవని చెప్పాలి. అబ్బాయి షర్ట్ లో బాగుంటే సూపర్ ఉన్నవని భార్య పొగడాలి. ఇలా చెయ్యడం వలన మీ రొమాంటిక్ లైఫ్ లో చాలా మార్పు వస్తుంది.
Image result for wife and husband
  1. మంచి శృంగారం…. ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికం లేని శృంగారం ఉండాలి. రాత్రిపూట ఎలాంటి నియమాలు లేకుండా శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ మధురమైన రాత్రిగా మార్చుకోవాలి. భార్య ఇలాంటి విషయాలలో బిడియంగా ఉంటుంది. భర్తనే చొరవ తీసుకుని ఈ విషయంలో భార్యను ఒప్పించాలి. ఇలా చేస్తే భార్యాభర్తలను ఎవరు విడదీయలేనంత దృడంగా ఉంటుంది.ఇది వందశాతం నిజం.
  2. కలిసి సరదాగా గడపడం….. కలిసి హాయిగా నవ్వుకునే ఏ అవకాశాన్ని వదలకండి. చిరునవ్వు అనేది జీవితానికి టానిక్స్ లాంటివి. నిస్తేజంగా ఉన్న జీవితంలోకి వెలుగులు తీసుకురావాలి.అలాగే నవ్వు అనేది ఇద్దరి మధ్య విడదీయరాని బంధానికి టయ్యప్ అవుతుంది.
  3. భవిష్యత్ గురించి మాట్లాడటం… చాలా మంది పాట్నర్స్ తో భవిష్యత్ గురించి మాట్లాడటానికి భయపడతారు. పాట్నర్ ను భయపెట్టినట్టు అవుతుందని లేక భవిష్యత్ లో సమాధానం చెప్పలేకపోతామేమో అని వారు భయపడతారు.ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంటె అలాంటిదేమి రాదు.భవిష్యత్ గురించి డిస్కస్ చేస్తే ఒకరి మీద ఒకరికి మంచి నమ్మకం ఏర్పడి మంచి బంధం ఏర్పడుతుంది.

ఇవేనండి భార్యాభర్తలు పాటించాల్సిన నియమాలు. మరి భార్యాభర్తల బంధం బాగుండాలంటే ఏం చెయ్యాలో మేము చెప్పిన విషయాల గురించి అలాగే ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.