కులాంతర వివాహం చేసుకున్న మరో ప్రేమ జంట..చంపడానికి రెడీ అవుతున్న మరో మారుతీరావు..మమ్మల్ని కాపాడండి అంటూ కంటతడిపెట్టిన భర్త.! చివరికి ఏమైందంటే.?

347

హైదరాబాద్ లో మరో మారుతీరావు తెరమీదకు రానున్నాడట. ప్రేమించిన పాపానికి అల్లుడిని చంపించి కలకలం సృష్టించిన మారుతీరావు ఈ క్రమంలో తండ్రి రాక్షసత్వాన్ని రుచిచూపిస్తే..మరో దుర్మార్గుడు ఎర్రగడ్డలో తన బిడ్డనే నరికి చంపే ప్రయత్నం చేశాడు. అయితే ఇవి జరిగిన సంఘటనలు. త్వరలో ఇలాంటి పరువు హత్య సంఘటన జరగనుందట. గత రెండు సంఘటనలకు కులం కారణం అయితే జరగబోయే సంఘటనకు మతం కారణం కానుందని ఆ ప్రేమికుడు వాపోతున్నాడు.ఇంతకు ఏం జరిగింది.ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందాం.

ఇద్దరి మతాలు వేరైనా.. వారి మనుసులు కలిశాయి. తోడునీడగా ఉండాలని కలలు కన్నారు. కన్నవారిని ఎదిరించి.. కులం గోడలు దాటి ఒక్కటయ్యారు. మనసు ఇచ్చిన ప్రియుడి కోసం పేరు కూడా మార్చుకుంది ఆ ప్రియురాలు. ఆర్యసమాజ్‌ సాక్షిగా ఆ జంట ఒక్కటైంది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి ఆ ప్రేమికుడి ఆవేదన మీడియాకు ఎక్కింది.పూర్తీ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో మతాంతర వివాహం చేసుకున్న ఓ వివాహిత కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది.బేగంబజార్‌కు చెందిన రాజు-నాజ్నీన్ అనే యువతి యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్యసమాజ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నాజ్నీన్ హిందూ మతాన్ని స్వీకరించి తన పేరును పూజగా మార్చుకుంది.అయితే ఈ నెల 17 నుంచి ఆ యువతి కన్పించకుండా పోయిందని ఆమెను తన కుటుంబసభ్యులు కిడ్నాప్‌ చేశారని రాజు ఆరోపిస్తున్నాడు. పరువు కోసం తన భార్యను చంపుతారని పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం తన భార్య 4 నెలల గర్భవతని ఆమెకు అబార్షన్ చేయిస్తానని తండ్రి బెదిరిస్తున్నాడని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పరువు కోసం తన భార్యను చంపుతారని ఆమెను తనకు అప్పగించాలని రాజు మీడియా ద్వారా తెలిపాడు.అయితే పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని.. అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులతో ఉందని చెబుతున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అమ్మాయి మైనరే కాబట్టి ఆమె ఇష్టప్రకారం ఎక్కడ ఉంటానంటే వారితో పంపిస్తామని పోలీసులు చెప్పారు.మరొక పరువు హత్య కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.