పార్లమెంట్ కి అండర్ వేర్ తీసుకువచ్చి ఈ మహిళ ఎంపీ ఏం చేసిందో చూసి అందరు షాక్

430

మహిళలపై అత్యాచారాలకు ఏ దేశమూ మినహాయింపు కాదు. దోషులకు శిక్షపడేదాకా మహిళా సంఘాలు ఉద్యమాలు చేస్తూనే ఉండటమూ కోత్త కాదు. ఐర్లాండ్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఆ దేశ పార్లమెంటును సైతం కుదిపేస్తుంది.మహిళల దుస్థితిని వివరించడానికి ఓ ఎంపీ ఏకంగా మహిళలు ధరించే లోదుస్తులను తీసుకుని పార్లమెంట్ కు వెళ్లారు. అంతేకాకుండా వాటిని చూపిస్తూ పార్లమెంట్ సాక్షిగా ప్రస్తుతం మహిళల సమస్యలపై ప్రసంగించారు. ఓ అత్యాచారం కేసులో బాధిత మహిళను కించపరుస్తూ కేసును వాదించిన లాయర్ పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఈ విషయాన్ని దేశ అత్యున్నత సభ ముందుకు తీసుకెళ్లడానికి మహిళా ఎంపి వినూత్న ప్రయత్నం చేశారు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఐర్లాండ్ లో ఇటీవల 17ఏళ్ల ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురయ్యింది. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా కోర్టులో ఓ లాయర్ బాధితురాలిని కించపర్చేలా వాదించాడు. ఈ కేసు విచారణ సమయంలో డిఫెన్స్ తరఫు న్యాయవాది కోర్టులో “మీరు ఆమె ఎలాంటి దుస్తులు వేసుకుందో కూడా చూడాల్సి ఉంటుంది. ఆమె ముందు వైపు లేసులు ఉన్న థాంగ్ ధరించారు.యువతి నిందితుడి పట్ల ఆకర్షణకు లోనైందని, ఎవరినైనా కలిసేందుకు, ఎవరితో అయినా ఉండేందుకు ఆమె సమ్మతించిందనే విషయాన్ని కాదనడానికి ఆధారాలు ఉన్నాయా అని ఆ లాయర్ వాదించాడు.ఆ యువతి ఎలాంటి అండర్ వేర్ వేసుకుందో మీరు చూశారా? అంటూ లాయర్ సాక్షులను ప్రశ్నించాడు.సరైన సాక్షాలు లేకపోవడంతో ఆ దారుణానికి పాల్పడిన నిందితున్ని కోర్టు నిర్దోశిగా విడుదల చేసింది.

దీంతో దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థపై ప్రజలు తీవ్ర నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మహిళా ఎంపి రూత్ తమ దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు ధరించే అండ‌ర్‌వేర్‌ను మిగతా ఎంపీలకు చూపిస్తూ కోపాన్ని ప్ర‌ద‌ర్శించారు. అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలు వేసుకున్న ఇలాంటి అండ‌ర్‌వేరే అంటూ నిరసన వ్యక్తం చేశారు.ఐర్లండ్‌ పార్లమెంటులో అండర్ వేర్ చూపించిన తర్వాత ఎంపీ టీడీ రూత్ కోపింగర్ మాట్లాడుతూ.. “జడ్జిలకు, జ్యూరీ సభ్యులకు ఇలాంటి విషయాల్లో తప్పనిసరి శిక్షణ ఇప్పించాల్సి ఉంటుంది’’ అని అన్నారు. దీంతో ఐర్లాండ్ లో అండర్ వేర్ ఉద్యమం స్టార్ట్ అయ్యింది.