రంభతో శృంగారం చేసిన రావణుడు నపుంసకుడిగా ఎందుకు మారాడు?

429

రామాయణంలో రావణుడు ఎంత పవర్‌ఫుల్ విలనో అందరికీ తెలిసిందే. సీతను అపహరించుకుపోయి ఆమెను అనుభవించాలని సూచిస్తాడు. కానీ అందుకు ఆమె అంగీకరించదు. దీంతో రావణుడు ఆమె అంగీకరం కోసం ఎదురు చూస్తాడు, కానీ ఆమెను బలవంతంగా ముట్టుకోడు కూడా. ఈ క్రమంలో రాముడు వానర సైన్యంతో వచ్చి రావణున్ని సంహరించి సీతను తీసుకెళ్తాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. అయితే రావణుడు సీతను ఎందుకు ముట్టుకోలేదు. రావణుడు తల్చుకుంటే సీతను అనుభవించేవాడు కదా. బలాత్కారం చేసి అయినా ఆమెను అనుభవించేవాడు కదా. మరి ఎందుకు చెయ్యలేదు. దీని వెనుక ఒక శాపం ఉంది. మరి అదేమిటో చూద్దామా.

Image result for రంభతో శృంగారం చేసిన రావణుడు

ఒకనాడు రావణాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని దేవతలు రాక్షసులు యక్షులు గంధర్వులలో ఎవరి వల్లనో తనకు మరణం సంభవించకూడదని వరం అడుగుతాడు. రావణుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఆ వరాన్ని రావణుడికి ఇస్తాడు.. వరం వచ్చిన అహంకారంతో ముల్లోకలా మీద దండయాత్ర చేస్తాడు.అదే క్రమంలో దేవతల మీదకు కూడా దండెత్తుతాడు. తన అపార రాక్షస సైన్యంతో కలిసి స్వర్గలోకం వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో కైలాస పర్వతం దగ్గర రాత్రి విశ్రాంత సమయంలో తన సైన్యంతో సహా ఆగుతాడు. రాత్రి సమయంలో కైలాస పర్వత అందాలను చూసి మంత్రముగ్దుడవుతాడు. ఈ సమయంలో రావణుడి మనసులో కామవికారం చెలరేగుతుంది.అదే సమయంలో స్వర్గ లోక అప్సరస అయిన రంభ ఆకాశ మార్గంలో విహరిస్తుంటుంది. ఆమెను చూసి ఆమె మీద మోహితుడై ఆమెను చెరబడతాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇది చాలా తప్పని కూతురి వయసున్న నా మీద మోహితుడవు అయితే చాలా పాపం అని తనను వదిలేయమని రంభ రావణుడిని కోరుతుంది. ఇది విన్న రావణుడు ఆశ్చర్యపోయి నువ్వు నాకు పుత్రిక సమానురాలివి ఎలా అవుతావు అని ప్రశ్నిస్తాడు.రావణుడి సహోదరుడు కుబేరుడి కుమారుడు నల్లకుబేరుడితో తానూ ప్రేమలో ఉన్నానని ఆ రకంగా తానూ పుత్రిక సమానురాలని చెబుతుంది.కామోద్రేకంతో ఉన్న రావణుడు ఇవేమి వినకుండా ఆమెను బలాత్కరిస్తాడు. ఆ తర్వాత ఈ విషయాన్నీ తన ప్రియుడైన నల్లకుబేరుడి దగ్గరకు వెళ్లి చెబుతుంది రంభ. విషయం తెలిసిన నల్లకుబేరుడు రావణుడి మీద కోపోద్రిక్తుడు అవుతాడు.దీంతో ఇక భవిష్యత్ లో రావణుడు పరాయి స్త్రీలతో బలవంతపు శృంగారం చెయ్యలేడు అని శపిస్తాడు.నల్లకుబేరుడి శాపం గురించి తెలుసుకున్న రావణుడు పర స్త్రీ మీద బలాత్కారం చెయ్యడం మానేస్తాడు.ఈ కారణంగానే తన చెరలో ఉన్నా కానీ రావణుడు సీతమ్మ తల్లిని ముట్టుకోలేదు. ఆమె ఇష్టంతోనే రావాలని అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నదీ ఎవరు సీతమ్మ తల్లి. ఆమె అంత ఈజీగా ఎలా వస్తుంది చెప్పండి.మరి రావణాసురుడి గురించి అలాగే రావణుడికి నల్లకుబేరుడు పెట్టిన శాపం గురించి దానికి కారణం అయినా రంభ స్టోరీ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.