బిగ్ బాస్ ని తిట్టి పంపించేసిన Jr NTR అందుకే వెంకటేష్ వచ్చాడా?ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలిస్తే షాక్.!

341

బిగ్ బాస్ సీజన్ 2 అయిపోయింది. చివరికి కౌశల్ గెలిచాడు.రన్నరప్ గా గీతామాధురి ఉన్నదీ.113 రోజులు ఇంట్లో గడిపి ప్రేక్షకుల మనసు దోచుకున్న వాళ్ళు విన్ అయ్యారు.అలాగే ఈ సీజన్ సక్సెస్ వెనుక హోస్ట్ నాని కూడా ఉన్నాడు.ముఖ్యంగా ఆయన ఇచ్చే వార్కింగ్ ఆయన ఇచ్చే సజెషన్స్ ఇంటి సభ్యులకు బూస్ట్ ఇస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ముఖ్యంగా కౌశల్ కు సెకండ్ వీక్ లో ఇచ్చిన బూస్ట్ అతని విజయానికి కారణం అయ్యింది.అయితే మొదటి సీజన్ లో ఎన్టీఆర్ చేశాడు.అయితే ఈసారి వీలు కాలేదు.హోస్ట్ గా కాకున్నా గెస్ట్ గా రావాలని బిగ్ బాస్ టీమ్ యాజమాన్యం ఎన్టీఆర్ ను కోరిందంట.అయితే బిగ్ బాస్ టీమ్ చేసిన ఒక పనికే ఎన్టీఆర్ రాలేదంట.ఇంతకు ఏం జరిగింది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి వెంకటేష్ కు బదులు మరొక స్టార్ హీరో కావలి కానీ వెంకటేష్ వచ్చాడు.ఆ హీరో ఎవరో కాదు ఎన్టీఆర్.బిగ్ బాస్ సీజన్ 1 కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేసి విజయవంతం చేశాడు.బిగ్ బాస్ సీజన్ 2 సమయంలో ఎన్టీఆర్ చాలా బిజీ కాబట్టి ఆ ఆఫర్ నాని కొట్టేశాడు.అయితే బిగ్ బాస్ 2 ఫైనల్ కు ఎన్టీఆర్ ను గెస్ట్ గా పిలుద్దామనుకున్నారు.మొదటి సీజన్ తో పోలిస్తే సెకండ్ సీజన్ రేటింగ్ కొంచెం తక్కువనే చెప్పుకోవాలి.ఫైనల్ కు భారీ క్రేజ్ రావాలంటే ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని అందరు అనుకున్నారు.అదే విషయాన్నీ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.ఎన్టీఆర్ కు భారీ మొత్తం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు బిగ్ బాస్ యాజమాన్యం.అయితే ఆ మాటలకు ఎన్టీఆర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడంట.మా నాన్న చనిపోయిన బాధలో నేను ఉంటె ఇలా అడగాలని మీకెలా అనిపించింది.మీకు మినిమమ్ కామన్ సెన్స్ లేదా అంటూ వాళ్ళ మీద ఎన్టీఆర్ విరుచుకుపడ్డాడంట.మనసులో ఎంత బాధ ఉన్నా 100 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి ఆపకుండా షూటింగ్ కు వెళ్తున్నాను.

నా వల్ల నిర్మాత నష్టపోకూడదనే షూటింగ్ కు వెళ్తున్నా లేకుంటే నాకు ఇప్పట్లో షూటింగ్ కు వెళ్లే ఆలోచన లేదు.అంతేకానీ నేను డబ్బుల కోసం పోవడం లేదు.మీరు డబ్బును ఆఫర్ చేస్తుంది చాలా తప్పు.బిగ్ బాస్ 1 కూడా నేను చేసింది డబ్బు కోసం కాదు కొత్తదనం కోసం.జనాలకు ఇంకా దగ్గర కావొచ్చు అని.నా ఎమోషన్స్ గురించి కూడా ఆలోచించాలి కదా అని ఎన్టీఆర్ చెప్పాడంట.అయితే ఎన్టీఆర్ కు సారీ చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు.ఆ తరువాత ఎవరిని పిలిస్తే బాగుంటుందనుకుని విక్టరీ వెంకటేష్ ను సంప్రదించగా ఆయన వచ్చేశాడు.ఈ విషయం తెలిసిన జనాలు బిగ్ బాస్ వాళ్లకు కొంచెం కూడా మానవత్వం లేదా అని తిడుతున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.