ఎర్రగడ్డలో ఒక్క మగాడు..నవదంపతులను చంపుతుంటే హంతకుడిని ఎగిరితన్నిన ఆ వ్యక్తి ఎవరో చూడండి

397

హైదరాబాద్ లో అత్యంత దారుణంగా యువ ప్రేమికులు నవ వధూవరులను చంపేందుకు అమ్మాయి మేనమామ ప్రయత్నించాడు. గోకుల్ థియేటర్ దగ్గర నవ దంపతులు రాగానే తన బ్యాగునుంచి కొడవలి తీసి ఒక్కసారిగా వారిద్దరిపై వెనుకనుంచి వేటు వేశాడు. ముందు అబ్బాయిపై వేటు పడగానే అతడు కుప్పకూలాడు. ఆ తర్వాత అమ్మాయి ప్రతిఘటించినప్పటికీ తన దగ్గరున్న కొడవలితో ముందు ఆమె చేయి నరికాడు.తర్వాత చెవిమీదుగా తలపై మరోవేటు వేశాడు.ఇలా ఇద్దరినీ నరికివేశారు.స్థానికులు వారిని హాస్పిటల్ కు తరలించారు.అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది.అయితే ఈ ఘటనలో ఒక హీరో బయటపడ్డాడు.చంపుతునే అందరు చూస్తూ ఉన్నారు.కానీ ఒక యువకుడు మాత్రం హీరోలా ఈ దారుణాన్ని ఆపాలని చూశాడు.మరి అతనెవరో చూద్దామా.

గోకుల్ థియేటర్ వద్ద హత్య జరుగుతుంటే అందరు సినిమా చూస్తున్నట్టు అతడి పక్కనుంచే వెళ్లిపోయాడు.ఒక వ్యక్తి అయితే అక్కడ ఏమి జరగనట్టు చాలా క్యాషువల్ గా నడుస్తూ వెళ్ళాడు. మరోవ్యక్తి పట్టుకుందామని ట్రై చేశాడు. ఐతే.. నిందితుడు కొడవలి చూపించడంతో అతడు భయపడి వెనక్కి వెళ్లిపోయాడు. ఐతే… అమ్మాయి మేనమామ వెనక్కి తిరిగి ఉన్నప్పుడు దూరం నుంచి పరుగెత్తుకంటూ వచ్చిన ఓ వ్యక్తి మాత్రం నిందితుడిని వెనుకనుంచి ఒక్క తన్ను తన్నాడు.కత్తి కింద పడుతుందని తన్నాడు కానీ ఆ హంతకుడు కత్తిని గట్టిగా పట్టుకోవడంతో కత్తి కిందపడలేదు. మళ్లీ అతడి తిరిగి కత్తి చూపించేలోపు దూరంగా పరుగెత్తాడు. ఇక్కడుంటే జనం పట్టుకుంటారన్న భయంతో నిందితుడు పారిపోయాడు.

అంతమందిలో జనం గుంపుగా చూస్తున్నప్పుడు కొడవలి వేటుకు చావుకు భయపడకుండా ధైర్యం ప్రదర్శించాడు ఆ యువకుడు. ఇలాంటి సందర్భంలో జనం ఇలాగే స్పందించాలి. ఇలాంటి తెగువే చూపించాలి. ప్రాణభయం అందరికీ ఉంటుంది. కానీ జనం కలిసికట్టుగా గుంపుగా ఎదిరించినప్పుడు గన్ను పట్టుకొచ్చినోడైనా భయపడిపోవడం ఖాయం. ఆ డేరింగ్ పర్సన్ వివరాలు తెలియవు కానీ సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో అతడి తెగువ కనిపించింది. నిందితుడిని ఎగిరి ఒక్క తన్ను తన్ని ఉలిక్కిపడేలా చేశాడు. చంపటానికి వచ్చినోడికే చావుభయం చూపించాడు. హత్యాయత్నం జరిగినప్పుడు ప్రాణాలకు తెగించి తనవంతుగా ప్రతిఘటించాడు. శెభాష్ బ్రదర్.అతనెవరు నిజంగా గ్రేట్ కదా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.మిర్యాలగూడ ఘటన మరవకముందే జరిగిన ఈ నవదంపతుల హత్య గురించి దానికి కారణమైన ప్రేమ పెళ్లి గురించి అలాగే హంతకుడి చేతిలో కత్తి ఉన్నా గానీ భయపడకుండా హీరోలా వచ్చి ఘాతుకాన్ని ఆపాలని చుసిన ఆ కుర్రాడి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.