అంత్యక్రియలు చేయడానికి వెళ్తే వరదరావడంతో.. చితిపై శవం.. తరువాత ఏమైందంటే?

619

సరిగ్గా వారం క్రితం దేశం మొత్తం ఒకటే టాపిక్.కేరళ వరదల గురించి తప్పా మరే విషయం గురించి చర్చలు లేవు.వారు పడుతున్న బాధలు వారికి వస్తున్న సహాయం వారి జీవన విధానం ఎలా ఉంటుందో అనే భయం..ఇలా రకరకాల విషయాల గురించి చర్చలు నడిచాయి.వారికి సహాయం చెయ్యడానికి దేశం మొత్తం కదిలింది.అయితే వరదల తగ్గుముఖం పట్టాయి.కొన్ని లక్షల మంది నిలవడానికి నీడ లేక ఇబ్బంది పడుతున్నారు.కొన్ని వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు.అయితే ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి కాబట్టి వరదల సమయంలో తమకు తమ కుటుంబానికి ఎలాంటి కష్టాలు వచ్చాయో కొంతమంది చెప్పుకోచారు.అయితే ఒక కుటుంబానికి వచ్చిన కష్టం మాత్రం ఎవరికీ రాకూడదు.మరి ఆ కుటుంబానికి వచ్చిన కష్టం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for burial ground

కేరళలోని పల్లికరై అనేది ఒక కూగ్రామం అది.ఆ ఊరిలో నివసించే గుణశేఖర్ అనే వ్యక్తి కూరగాయలు తీసుకొస్తా అని చెప్పి బయటకు వెళ్లి కారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు.ఇంట్లో వ్యక్తి చనిపోయాడనే భాధ ఒకవైపు ఉంటె అప్పుడప్పుడే పడుతున్న వర్షాలు వరదలుగా మారుతున్నాయి.ఇలాంటి కష్ట సమయంలో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు.కానీ బయటకు వెళ్దాం అంటే అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి.పోనీ ఇంట్లో పెట్టుకుందామంటే కుల్లిపోతుందేమో అనే భయం.అందుకే మూడు రోజులు ఆ శవాన్ని కారులోనే ఉంచారు ఆ కుటుంబం.కొంచెం వర్షాలు తగ్గింది అని గమనించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు.అయితే అంత్యక్రియలు జరుపుతున్న సమయంలో మళ్ళి వర్షం పెద్దగ పడి వరదలు వచ్చాయి.

Image result for burial ground

అయితే ఈసారి భారీగా వరదలు రావడంతో అందరు తమ ప్రాణాలను కాపాడుకోవాలనే ఆశతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.శవాన్ని తీసుకెళ్లలేరు కాబట్టి అక్కడే ఉంచేసి వెళ్ళారు.దాంతో శవం వరదలలో కొట్టుకుపోయింది.దీంతో అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.భారీ వరదలు కావడంతో ఆ శవం ఎక్కడికి వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు.అంత్యక్రియలు చెయ్యడానికి వీలు లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కానీ జరిగిన విషయానికి మనం ఏం చేస్తాం ప్రకృతి పగబట్టితే మనం ఏం చేద్దాం మరచిపోండి అని ఆ కుటుంబానికి దైర్యం చెబుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు.ఈ విషయం గురించి ఆ నోట ఈ నోట పడి మీడియాకు తెలిసింది.దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.వింటుంటే చాలా బాధ వేస్తుంది కదూ.కేరళలో వచ్చిన ప్రళయం ఇలా కొందరికి జీవితాంతం చేదు సంఘటనలను మిగిల్చింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కేరళలో వచ్చిన ప్రళయం గురించి అలాగే అక్కడ జరిగిన నష్టం గురించి అలాగే ఈ కుటుంబానికి వచ్చిన కష్టం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.