11 ఏళ్ళ కొడుకు బాత్రూంకు వెళ్ళగానే, ఫోన్ చూసి షాక్ అయిన తల్లి

382

నేటితరంలో పిల్లలు స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయ్యారు.ఉదయం లేచినప్పటినుంచి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతున్నారు.ఫోన్ జీవితంలో ఒక భాగం అనే విషయాన్నీ మరచిపోయి ఫోనే జీవితం అనుకునే స్థితికి చేరుకున్నారు.అయితే స్మార్ట్ ఫోన్ వలన పిల్లల జీవితాలు బాగుపడుతున్నాయా నాశనం అవుతున్నాయా అంటే నాశనం అవుతున్నాయనే చెప్పుకోవాలి.ముఖ్యంగా అశ్లీలతకు అలవాటు పడుతున్నారు.ఇప్పుడు ఒక తల్లికి తన కొడుకు మీద అనుమానం రావడంతో అతని ఫోన్ చుసిన ఆమెకు దిమ్మతిరిగే విషయం బయటపడింది.మరి ఏం బయటపడిందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for chliderns playing mobile

ఫ్లోరిడా లో తన 11 ఏళ్ల కొడుకుతో కలిసి ఓ ఫ్లాట్ లో ఉంటోంది తల్లి. భర్త లేకపోవడంతో కుమారుడికి ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది. అయితే కొద్ది రోజులుగా కొడుకు ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిందామె. ఎప్పుడూ ఫోన్ ను వదలకపోవడం, ఇంటర్నెట్ ను తెగ ఉపయోగించడం ఆమెలో ఆనుమానాన్ని రేకెత్తించింది. దీంతో కొడుకు బాత్రూంకు వెళ్లిన సమయంలో అతడి ఫోన్ ను తీసుకుంది. గ్యాలరీ ఓపెన్ చేసి చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నగ్న ఫోటోలు ఆ ఫోన్ లో దర్శనమిచ్చాయి. దీంతో ఆ ఫోటోలు వచ్చిన నెంబర్ ను రాసుకుని యథాస్థానంలో పెట్టేసింది. ఆ నెంబర్ ను ట్రేస్ చేయగా నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్ లో హార్బర్ యునైటెడ్ మెథాడిస్ట్ చర్చి ఫాథర్ టేలర్ సింకుస్ స్మితెర్ అని తేలింది. 30 ఏళ్ల స్మితెర్ పెళ్లి చేసుకోకుండా పాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో ఆ బాలుడి తల్లి అతడిపై కేసు పెట్టింది. బాలుడిని విచారించగా అనుకోకుండా అతడి నుంచే తనకు మెసేజ్ వచ్చిందనీ మొదట్లో బాగానే మాట్లాడేవాడని తెలిపాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కొద్ది రోజుల తర్వాత శృంగారపూరితమైన మెసేజ్ లు పెడుతూ ఫోటోలను పంపేవాడన్నారు. దీంతో తాను అతడికి సమాధానం ఇవ్వడం మానేశానని బాలుడు తెలిపాడు. ఆ తర్వాత కూడా అతడి నుంచి నగ్న ఫోటోలు వస్తూనే ఉన్నాయనీ, తల్లికి ఎలా చెప్పాలో తెలియక బాధపడేవాడినని బాలుడు పోలీసులకు వెల్లడించాడు.బాలుడి వాదన ఇలా ఉంటే తనకు ఏమీ తెలియదనీ, తన నెంబర్ తో వేరే వారు ఫోటోలు పంపి ఉంటారని స్మితెర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దైవం తనను పరీక్షిస్తోందంటున్న అతడు లక్ష డాలర్ల బాండ్ ధర చెల్లించి బెయిల్ పై విడుదలయ్యాడు.ఇలాంటి ఘటనలు సమాజం లో అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయి.స్మార్ట్ ఫోన్ల మోజులో పడి సోషల్ మీడియా లో వచ్చే ప్రతి దానికి స్పందిస్తూ ఉంటె ఇలాంటి ప్రతి ఘటనలే ఎదురవుతాయి. సో ఆలోచించి అడుగు వేయండి మీ జీవితాన్ని కాపాడుకొండి. అలాగే మీ పిల్లలు కూడా ఫోన్ ను ఎక్కువగా వాడుతుంటే అతని మీద ఒక కన్నేసి ఉంచండి.లేకుంటే వారి జీవితాలే నాశనం అవుతాయి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ యువకుడి ఫోన్ లో నగ్న చిత్రాలు ఉన్న ఘటన గురించి అలాగే స్మార్ట్ ఫోన్ వచ్చాక యువత చెడిపోతున్న విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.