షాక్: ఆడపిల్ల పుడితే 12 ఏళ్ల తర్వాత మగబిడ్డగా మారిపోతుంది..

465

ఈ సృష్టిలో స్కానింగ్ అనేది క‌నిపెట్ట‌క‌పోతే పుట్టేది మ‌గ‌బిడ్డా లేదా ఆడ‌బిడ్డా అనేది, చాలా వ‌ర‌కూ ఎవ‌రికి తెలిసేది కాదు.. కాని ఇంత వైద్య‌శాస్త్రం అభివృద్ది చెందడంతో ఎన్నో ప‌రిణామాలు జ‌రుగుతూ, అనేకానేక ఆవిష్క‌ర‌ణలు జ‌రిగాయి. వైద్యులు కూడా ఇప్పుడు ఓ తెగలో జ‌రిగే వింత‌ని చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంత‌కీ ఆ వింత ఏమిటి అని అనుకుంటున్నారా ఇప్పుడు ఆ విష‌యంలోకి వ‌ద్దాం.

తల్లి క‌డుపు నుంచి పుట్టాక ఆడ‌బిడ్డ‌నో, మ‌గబిడ్డ‌నో తెలిసిపోతుంది. కానీ అక్కడ మాత్రం పుట్టిన ప‌న్నెండేళ్ల‌కు గానీ పుట్టింది ఆడో, మ‌గో తెలియ‌దు. ఒక‌వేళ ఆడబిడ్డ పుడితే ప‌న్నెండేళ్ల త‌ర్వాత మ‌గ‌బిడ్డ‌గా మారిపోతుంది. మ‌గ‌బిడ్డ‌గా పుడితే మాత్రం మ‌గ‌బిడ్డ‌గానే ఉండిపోతుంది. ఇంత‌కీ అదెక్క‌డో తెలుసా ? క‌రేబియ‌న్ దీవుల్లోని డొమినిక‌న్ రిప‌బ్లిక్‌లో జ‌రుగుతోంది.. అక్క‌డే ఎందుకిలా జరుగుతుంది? అని డాక్టర్ల‌ను అడిగితే వారు చెప్పిన కార‌ణం వింటే షాకైనా వైద్య‌శాస్త్రంలో కొత్త సంగ‌తి తెలుసుకుంటారు మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఈ విష‌యం తెలుసుకుందాం.

త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు ఎంజైమ్ కార‌ణంగా ఆడ‌శిశువుగా పుట్టాల్సిన బిడ్డ మ‌గ‌బిడ్డ‌గా మారిపోతుంది. దీనికి కార‌ణం ఆడపిల్ల‌గా పుట్టిన వారిలో డీ హైడ్రో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్‌… దీని వ‌ల్ల ఆడ‌పిల్ల‌కు ప‌న్నెండు సంవ‌త్స‌రాల వ‌య‌సు రాగానే మ‌గ‌పిల్ల‌లుగా మారిపోతున్నార‌ని తేలింది. ఇలా ఆడపిల్ల‌లు మ‌గ‌పిల్ల‌లుగా మార‌డాన్ని వైద్య‌శాస్త్ర ప‌రిభాష‌లో గెవెడాసెస్ అంటారు. ఇదే ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు వైద్యులు.

ఇక డొమినిక‌న్ రిప‌బ్లిక్‌లో ఇలా ఆడ‌పిల్లలుగా పుట్టి మ‌గ పిల్ల‌లుగా మారిన వారి గురించి చెప్పాలంటే, 90 మందిలో ఒక‌రు ఇలా అయిపోతున్నార‌ట‌. సాలినాస్ ప‌ట్ట‌ణంలో అయితే ప్ర‌తీ 90 మందిలో ఇద్ద‌రు ఆడ‌శిశువులుగా పుట్టి మ‌గ‌బిడ్డ‌లుగా మారిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘ‌ట‌నే 1970లో మొట్ట‌మొద‌టిసారి ఇక్క‌డే వెలుగు చూసింద‌ట‌.. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ఇలా అయితే ఆడ‌పిల్ల‌ల్లేని ఊరుగా డొమినిక‌న్ చ‌రిత్ర‌లో నిలిచిపోతుందేమో అని అంటున్నారు ఇక్క‌డ ప‌క్క ప్రాంతం ప్ర‌జ‌లు. మ‌రి చూశారుగా అందుకే ఇక్క‌డ ఇలాంటి ప‌రిస్దితి తలెత్తింది ఇలా జ‌రిగేది కేవ‌లం ఈ ఒక్క ప్రాంతంలోనే అని ఇలా ఎక్క‌డా జ‌రుగ‌దు అని చెబుతున్నారు. ఇది ఈఏరియా ప్ర‌త్యేక‌త‌గా కూడా మారిపోయింది అని చెబుతున్నారు. చూశారుగా ఈ మెడికో విష‌యంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.