హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఏమి జరుగుతోంది

154

హైదరాబాద్ సువిశాల నగరం. ఎవరు ఎలాగైనా బతకవచ్చు. అడిగేవాడే ఉండడు. ఎవరి పనుల్లో వాళ్ళే మునిగిపోతుంటారు. పక్కవాళ్ళ గురించి పట్టించుకునే నాధుడే ఉండడు . ఒకవేళ అవతలి వాళ్ళ విషయాలలో కలగజేసుకుంటే నీకెందుకు అని మనల్నే అంటారు. అయితే యువతలో కూడా ఇదే ధోరణి ఉంది. హైదరాబాద్ నగరంలో యువత రోడ్ల మీద చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పబ్లిక్ ప్లేస్ అని చూడరు, ప్రైవేట్ ప్లేస్ అని చూడరు. ఎవరి పనుల్లో వారు రెచ్చిపోతారు. ఎవరైనా వారిని ప్రశ్నిస్తే వారి మీదికే గొడవకు దిగుతారు.

Image result for hyderabad necklace road romance

ముఖ్యంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. అక్కడ ప్రేమ జంటల వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక ప్రేమ జంట అసభ్య ప్రవర్తన చూడలేక ఇదేంటి అని ప్రశ్నించినందుకు ఒక యువకుడిని చావ చితక్కొట్టాడు ఓ ప్రేమికుడు. గాయాలపాలైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బహిరంగంగా రోడ్ పై అమ్మాయితో చేసే చెత్తపని ప్రశ్నించినందుకే ప్రాణాలు పోయేలా కొట్టిన ఘటన సభ్య సమాజాన్ని ఎటు ప్రయాణిస్తున్నాం అని ప్రశ్నిస్తోంది. రెండు రోజుల క్రితం నెక్లెస్ రోడ్ లో ప్రేమ జంట దాడిలో గాయాలపాలైన యువకుడు సాయి సాగర్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో బంధువులు ఉస్మానియా ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నెక్లెస్ రోడ్ లో ఓ ప్రేమ జంట అసభ్యంగా ప్రవర్తించింది. నడి రోడ్ మీద వారు చేస్తున్న చేష్టలను చూసిన కొందరు యువకులు వారికి అడ్డుచెప్పారు. దీంతో మాకే అడ్డు చెప్తారా అంటూ ప్రేమికుడు రెచ్చిపోయాడు. ఇష్టంవచ్చినట్టు సాయి సాగర్ అనే యువకుడ్ని పిడి గుద్దులు గుద్దాడు .

ఈ క్రింది వీడియో చూడండి

చనిపోయిన సాయి సాగర్ కు 10 రోజుల క్రితమే పెళ్లి అయ్యింది. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం సాయి సాగర్ నెక్లెస్ రోడ్ కి వెళ్లాడు. అనుకోకుండా అక్కడ ప్రేమజంట అసభ్య ప్రవర్తను ప్రశ్నించడం అతడి పాలిట శాపమైంది. అతని ప్రాణాలను బలిగొంది. ఓ నవవధువుకు కన్నీరు మిగిల్చింది . సాయి మృతితో ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాయి మృతి కారణం అయిన క్రిమినల్ కి హైదరాబాద్ లో పోలీసులు సహకరిస్తున్నారని సాయి ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు . ఉస్మానియా ఆస్పత్రి ముందు అతన్ని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేస్తున్నారు. సాయి మృతితో అతని ఇంట్లో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ముబీన్ ను కఠినంగా శిక్షించాలని సాయి బంధువులు, ఫ్రెండ్స్ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. యువకుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిని చనిపోయేలా కొట్టిన ప్రేమికుడు ముబీన్ ను రాంగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. సాయి సాగర్ పై దాడికి పాల్పడిన ముబీన్ కు నేర చరిత్ర ఉంది . అతను ఓ క్రిమినల్ అని, అతడిపై ఇప్పటికే 16 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ముబీన్ పై మిర్యాలగూడలో కూడా చాలా కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. అతడిపై పీడీ యాక్ట్ కూడా ఉంది. చూశారుగా రోడ్ల మీద అసభ్యకరంగా చెయ్యొద్దు అన్నందుకు ఎలా చితకబాది చంపేశారో. మరి ఈ ఘటన గురించి అలాగే హైదరాబాద్ రోడ్ల మీద యూత్ చేసే అసభ్యకర పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.