సైనికుల మీద దాడి జరగడానికి ఒక నిమిషం ముందు ఏం జరిగింది… చనిపోయిన జవాన్ చివరి మాటలు వింటే ఏడ్చేస్తారు..

364

మొన్న జరిగిన పుల్వామా దాడిలో మొత్తం 43 మంది వీర మరణం చెందారు. ఈ ఘటన కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు ఇంతపని చేశారా అని వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు. యావత్తు ప్రపంచం భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదం నశించాలని కోరుకుంటున్నారు. జమ్ము కశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో మృతి చెందినవారిలో యూపీకి చెందినవారు 12మంది ఉన్నారు. వీరిలో జవాన్ ప్రదీప్ సింగ్ యాదవ్ ఒకరు. ఈ దాడిలో మృతి చెందిన ఒక్కో సైనికుడిది ఒక్కో కథనం..అవి తలచుకుంటే మనస్సు ద్రవించిపోతుంది.

Image result for pulwama

రాజస్థాన్‌కు చెందిన రోహితేశ్ లాంబా అనే జవాన్‌ కు పెళ్లి జరిగి ఒక్క సంవత్సరమే అయింది. అతనికి 2018 డిసెంబర్ లో ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపను కళ్లారా చూడకుండా ఉగ్రదాడికి బలైపోయాడు. ఇటువంటి కథలు ఎన్నో ఎన్నెన్నో. ఈ దాడిలో యూపీకి చెందిన సైనికుడు ప్రదీప్ సింగ్ యాదవ్ కథనం మరొకటి..సరిగ్గా దాడి జరగటానికి ముందు ప్రదీప్ సింగ్ తన భార్యతో ఫోన్ మాట్లాడుతున్నాడు.అంతలోనే ఆత్మహూతి దాడి జరగడం..ప్రదీప్ సింగ్ మృతి చెందటం జరిగిపోయింది. ఏదో ప్రమాదం జరిగిందనీ భార్య నీరజకు అర్థమయ్యింది. భయపడిపోయింది..మనసుకు ఏదో కీడు శంకించడంతో ఏం జరిగిందో తెలుసుకోడానికి పదే పదే ఫోన్ చేసింది. కానీ ఫోన్ కలవలేదు. అల్లాడిపోయింది. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిందని, ఇది ఊహించని ఘటన అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి 

తనతో మాట్లాడుతోన్న సమయంలో ఉగ్రవాది తన వాహనంతో ఢీకొట్టి ఆత్మహుతి దాడికి పాల్పడిందనీ..బాంబు శబ్దాలు అవతలివైపు నుంచి వినపడటంతో ప్రమాదం జరిగినట్టు ఊహించానని..కానీ తన భర్త ప్రాణాలతో ఉండి ఉంటాడనే తన ఆశలను అడియాసలు చేస్తు కొంత సమయానికి భర్త చనిపోయాడని సీర్పీఎఫ్ కంట్రోల్ రూం నుంచి కాల్ చేసి చెప్పారని..భర్తతో అదే చివరిసారి మాట్లాడటం అవుతుందని ఊహించలేదని విలపిస్తోంది నీరాజ్ కనౌజ్ జిల్లా సుఖేసన్‌పూర్‌కు చెందిన ప్రదీప్ సింగ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు సుప్రియ (10), సోనా (2) అనే ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఆర్మీలోఉంటున్న క్రమంలో కల్యాణ్‌పుర సమీపం బరాసిరోహిలోని తన పుట్టింట్లో ఉంటోంది. భర్త రిటైర్ అయిన తరువాత అందరూ కలిసి ఆనందంగా ఉంటామని ఆశించాననీ..కానీ ఇప్పుడు తన ఇద్దరు బిడ్డలకు తండ్రి శాశ్వతంగా దూరమైపోయాడనీ..పిల్లల ఏడుపుని ఆపటం సాధ్యం కావటంలేదని నీరజ వాపోయింది. ఇలా తవ్విచూస్తే ప్రతి సైనికుడి వెనుక ఒక కథ ఉంది. దేశానికి ప్రాణత్యాగాలు చేసిన వారు ఏ లోకంలో ఉన్నా ఈ దేశం వారిని మరవదు. సెల్యూట్ టూ వీర జవాన్లు. మరి ప్రదీప్ సింగ్ భార్య ఆవేదన గురించి అలాగే ఈ ఉగ్రదాడి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.