జస్ట్ బీర్ సీసాలతో నిర్మించిన ఈ ఆలయం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

287

ఈ ప్రపంచం ఎన్నో వింత ప్రదేశాలు మరియు వస్తువులతో నిండి వుంది. మనిషి అన్నిసమయాలలో కొత్తదనాన్ని చూడటానికి ఇష్టపడతాడు.అందుకోసం ఈ ప్రపంచంలో రోజుకో కొత్తదానిని స్పృష్టిస్తున్నారు. ఒక్కొక్కసారి మనం చూసేవి ఆశ్చర్యానికి గురయ్యేటట్టు చేస్తాయి..వాటిలో ఎన్నో దేవాలయాలు పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి.అయితే ఇప్పుడు మీకొక గుడి గురించి చెప్పబోతున్నాను.ఏదైనా గుడిని నిర్మించాలంటే ఎంతో పెద్ద ఖర్చు అవుతుంది.సిమెంట్ బ్రిక్స్..ఇలా చెప్పుకుంటూపోతే చాలా అవసరం ఉంటాయి కదా..కానీ కేవలం బీర్ సీసాలతో నిర్మించిన ఆలయం గురించి మీకు తెలుసా…తెలీదు కదా.. ఈ ప్రత్యేక అద్భుతమైన ఆలయం గురించి పూర్తీగా తెలుసుకోవాలని ఉంది కదా..మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చెబుతా వినండి.

ఈ ఆలయం లోపల దాదాపు ప్రతిదీ బీర్ సీసాలతో తయారుచేసారు..

కేవలం బీరు సీసాలు ఉపయోగించి థాయిలాండ్ లో ఒక ఆలయాన్ని నిర్మించారని మీకు తెలుసా… ఇది ప్రజల మధ్య మిశ్రమ ప్రతిచర్యను సృష్టించింది. ఎందుకంటే ఇక్కడి స్థానికులు వారి మనోభావాలను దెబ్బతీశారని నమ్ముతారు, అయితే ఈ మొత్తం ఆలయం కేవలం కేవలం బీరు సీసాలుతో తయారు చేసి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. బీర్ సీసాలతో దేవాలయాన్ని నిర్మించాలనే ఆలోచన 80’స్ మధ్యకాలం లో ఒక సన్యాసినికి కలిగింది. అతని స్నేహితులలో కొందరు ఖాళీ సీసాలతో వారి గుడిసెలను అలంకరించటానికి ఉపయోగించారు.ఆ ఆలోచన అందరికి బాగా నచ్చింది.అలాగే ఒక ఆలయాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఊరిలో అందరికి చెప్పారు. ప్రజలు వారి ఖాళీ సీసాలు దానం చేయడం ప్రారంభించారు. ఫలితంగా వారు కొత్త ఆలయాన్ని నిర్మాణానికి తగినన్ని సీసాలను పొందారు. ఈ సన్యాసులు వేర్వేరు ఆకారాలు మరియు బ్రాండ్లు ఉన్న ఒక మిలియన్ ఖాళీ సీసాలను సేకరించారు. వారు సేకరించిన ఈ సీసాలను ఉపయోగించి ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.ఇక ఆలస్యం చెయ్యకుండా ఆలయాన్ని నిర్మించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ దేవాలయాన్ని తయారుచేయడానికి దాదాపుగా అన్ని ఖాళీ సీసాలనే వాడటం జరిగింది.అక్కడక్కడా బీరు ఉన్న సీసాలను వాడారు అంతే. మొత్తం సీసాలనే ఉపయోగించి అందరినీ ఆశ్చర్యపరిచేలా అందంగా కనిపించే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది వాస్తుశిల్పికి గొప్ప సవాలుగా ఉండేది. స్నానపు గదులు నుండి శ్మశానం వరకు, మొత్తం ఆలయం బీర్ సీసాలతో తయారు చేయబడింది. వారు ఖాళీ సీసాలను మాత్రమే కాకుండా బంగారు గాజు మొజాయిక్ ని కూడా ఉపయోగించారు.ఇక్కడ ఒక బుద్ధుడిని కూడా చూడవచ్చు..ఈ ఆలయంలో రెండు పెద్ద బుద్ధుని బొమ్మలు ఉన్నాయి. చూడటానికి బుద్దులు చాలా బాగుంటారు..ఆ బుద్ధులను బుదై అని పిలుస్తారు. వ్యర్థాలను పునర్వినియోగించడం మరియు దాని ఉపయోగాలను తెలుపడానికి ఇదొక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. వింటుంటే వాట్ అన్ ఐడియా అని అనిపిస్తుంది కదా.మరి ఈ బీర్ లతో నిర్మించిన ఆలయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.