ట్రెయిన్ లో ఈ అమ్మాయి ఏం చేసిందో చూస్తే మీకిక నిద్ర పట్టదు

346

ముంబై లోకల్ ట్రైన్స్ లో డేంజర్ స్టంట్స్‌తో రెచ్చిపోతోంది యువత. కదులుతున్న రైలులో విన్యాసాలు చేస్తూ ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నారు.లోకల్ ట్రైన్ లో వెళ్తూ బయట చేతులు కాళ్ళు పెడుతూ విన్యాసాలు చేస్తారు.వాటికి సంబందించిన అనేక వీడియోలను మనం ఇప్పటికే చాలా చూశాం.ఈ మధ్య ఓ గ్యాంగ్ కు రైల్వే పోలీసులు చెక్ పెట్టినా ఈ స్టంట్స్‌ ఆగడం లేదు. తాజాగా మరో యువతీ ఇదే విధంగా లోకల్ ట్రైన్ లో స్టెంట్స్ చేసింది.అయితే ఆమె కావాలని చెయ్యలేదు.క్యాజువల్ గా చేసింది.కానీ అదే ఆమెకు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.ఇంతకు ఏం జరిగిందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for local train

మహారాష్ట్ర థానె జిల్లా దివాకు చెందిన ఆ యువతి సీఎస్‌టీలో కల్యాణ్ వెళ్లే ట్రెయిన్ ఎక్కింది. ట్రెయిన్‌లో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ ఫుట్‌బోర్డు వద్ద నిలుచుంది. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్‌లో మాట్లాడుతోంది. ఫుట్‌బోర్డు మధ్యలో ఉన్న పోల్‌ను పట్టుకొని ఇక విన్యాసాలు చేయడం ప్రారంభించింది. చుట్టూ కొంతమంది ఉన్నారు.పక్కనే ఒక అబ్బాయి కూడా ఉన్నాడు.ఆ అమ్మాయి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ప్రపంచాన్నే మరచిపోయింది.డోర్ హ్యాండిల్ పట్టుకుని వేలాడుతూ చేతులు బయటకు చాచి నుంచునేందుకు ప్రయత్నించింది. ఇంతలో పక్క నుంచి మరో లోకల్ రైలు రావడంతో కంగారులో ఆమె చేతులు వదిలేసింది.అదుపుతప్పి లోకల్ ట్రెయిన్ కిందికి జారింది. అప్పుడే వేరే లైన్ నుంచి మరో లోకల్ ట్రెయిన్ వెళ్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు ఆ యువతిని పట్టుకున్నారు. ఆమె పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు ఆమె దుస్తులు పట్టుకుని, తోటి ప్రయాణికుల సాయంతో ఆమెను పైకి లాగాడు. లేకపోతే ఆమె కిందపడి ప్రాణాలు కోల్పోయేది.తను కింద పడగానే ప్రయాణికులు ఆన్‌దిస్పాట్ తనను పైకి లాగారు.వాళ్లు ఏమాత్రం లేట్ చేసినా తన స్టంట్ కాస్త బెడిసికొట్టేది. ఈ ఘటన మొత్తం వీడియో తీసిన మరో ప్రయాణికుడు వాట్సాప్‌లో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.ఒక్క క్షణంలో ఆమె యముడి దగ్గరకు వెళ్లివచ్చింది.అందుకే అంటారు జాగ్రత్తగా ఉండాలని.విన్నారుగా ట్రైన్ లో స్టెంట్స్ చేస్తే ఏమవుతుందో.మీరు మాత్రం అలా డోర్ దగ్గర ఉండి విన్యాసాలు చేయకండి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఈ యువతీ గురించి ఆమెకు ఎదురైన ఘటన గురించి అలాగే ఇలా లోకల్ ట్రైన్ లలో విన్యాసాలు చేసే యువత గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.