మహిళ గొంతులో ఏముందో చూసి షాకైన డాక్టర్లు సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రమే చూడండి

352

జలగ పట్టుకుందంటే రక్తం పీల్చే వరకు వదలదు. అలాంటిది ఓ మహిళ గొంతులో సుమారు మూడు నెలలు తిష్ట వేసింది. ఆమె రక్తం పీలుస్తూ బాగానే బతికేసింది. ఈ విషయం ఆమెకు కూడా తెలీదు. గొంతులో ఏదో మంటగా ఉండటంతో పాటు తలనొప్పి తీవ్రంగా వస్తుండటంతో ఆమె గత వారం వైద్యులను సంప్రదించింది. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆమె గొంతును పరిశీలించిన వైద్యులు.. అన్నవాహికలో గడ్డ ఉందని, సర్జరీ చేసి తొలగించాలని తెలిపారు. సర్జరీ నిర్వహిస్తున్న వైద్యులు గొంతులోకి చిన్న కెమేరాను పంపి పరిశీలించారు. రిపోర్డుల్లో తాము గుర్తించింది గడ్డ కాదు.. జలగ అని తెలుసుకుని నివ్వెరపోయారు. చిన్న పిన్ సాయంతో గొంతులో ఉన్న జలగను నెమ్మదిగా బయటకు తీశారు. దాని పొడవు సుమారు రెండు ఇంచులు ఉంది.

Image result for జలగ

వైద్యులు వెలికి తీసిన ఆ జలగ బతికే ఉండటం గమనార్హం. ఆ జలగ నోట్లోకి ఎలా వెళ్లిందని ఆమెను ప్రశ్నిస్తే.. మూడు నెలల కిందట తాను జలపాతంలో స్నానం చేశానని, అప్పుడే దాన్ని మింగి ఉంటానని తెలిపింది. ఆ తర్వాత నుంచి తనకు తలనొప్పి, గొంతు నొప్పి రావడం మొదలైందని చెప్పింది. ఈ ఘటన దక్షిణ కొరియాలోని హగియాంగ్‌లో చోటుచేసుకుంది. ఆమె గొంతు నుంచి జలగను వెలికి తీస్తున్న దృశ్యాన్ని వీడియో తీశారు ఇక ఆమె మ‌త్తువ‌దిలిన త‌ర్వాత చూస్తే ఆ జ‌ల‌గని చూసి ఆశ్చ‌ర్య‌పోయింది వాటిని గొంతులో త‌డిగా ఉండ‌టంతో గొంతు ద‌గ్గ‌ర ఇర‌క్కుని అలా బ్ర‌తికింది అని చెబుతున్నారు వైద్యులు, నీటిలో ఉన్న స‌మ‌యంలో ఇది చిన్న‌గా ఉండి ఉంటుంది త‌ర్వాత పెద్ద‌ది అయ్యి ఉంటుంది అంటున్నారు వైద్యులు. మ‌రి చూశారుగా బ‌య‌ట స్నానాల‌కు వెళ్లిన స‌మ‌యంలో ఇలాంటి జీవుల నుంచి మీకు మీరే కాపాడుకోవాలి.