కేరళ బాధితులకు సుమ ఏమి సాయం చేసిందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

452

కేర‌ళ ప్ర‌జ‌ల‌ను చూసి యావ‌త్ దేశం త‌ల్ల‌డిల్లిపోతోంది.. వ‌ర‌ద‌ల‌తో క‌కావిక‌లంగా మారాయి కేర‌ళ‌లో ప‌లు ప్రాంతాలు.. ఇప్ప‌టికే వ‌ర‌ద నీటిలో చిక్కుకుని ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని భ‌గ‌వంతున్ని ప్రార్దిస్తున్నారు.. ఆగ‌స్టు 8 వ తేదినుంచి ఎడ‌తెర‌పి లేని వ‌ర్షాలు వ‌ర‌ద‌లు కేర‌ళ‌ను ముంచెత్తాయి.. ఇక కేర‌ళ‌లో మునుపెన్న‌డూ లేని విధంగా వంద సంవ‌త్స‌రాలకాలంలో ఏ నాడు లేని విధంగా ఈ వ‌ర‌ద‌లు అపార‌న‌ష్టాన్ని చేకూర్చాయి.. 8 వేల కోట్ల రూపాయ‌ల ఆస్తి న‌ష్టం సంభ‌వించి ఉంటుంద‌ని ఓ అంచ‌నాకి వ‌చ్చారు అధికారులు.

ఇక ప‌లు రాష్ట్రాలు కూడా సాయం చేస్తున్నాయి.. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు సినీ నటులు ముందుకొచ్చారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటులు ముందుకొచ్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. వారికి ఆర్థికసాయం ప్రకటించి తమకు తోచినంత విరాళం ఇచ్చారు. జల దిగ్బంధం నుంచి కేరళ వాసులు త్వరగా బయటపడాలని ఆకాంక్షించారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. తాజా సమాచారం ప్రకారం తమిళ హీరో విజయ్ కేరళకు .14 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందించినట్టుగా తెలుస్తుంది. మరో సినీనటుడు ఉదయనిధి స్టాలిన్ కేరళ బాధితుల కోసం రూ.10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఈ స‌మ‌యంలో త‌మిళ‌న‌టుల్లో మొట్ట‌మొద‌ట‌గా క‌మ‌ల్ హాసన్ రూ.25 ల‌క్ష‌లు డొనేట్ చేశారు.

Image result for suma

తెలుగులో యాంక‌ర్ గా సెటిల్ అయిన సుమ కూడా కేర‌ళ నుంచి వ‌చ్చిన మ‌హిళే ఆమె కూడా కేర‌ళ వ‌ర‌ద‌బాధితుల‌కు త‌న వంతు సాయం చేయాల‌ని చూస్తున్నారు అని తెలుస్తోంది.. సుమారు ఆమె 50లక్ష‌ల విరాళం ఇవ్వ‌నున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.. అయితే మా అసోషియేషన్ రూపంలో ఆమె ఇస్తారా లేదా నేరుగా సీఎం రిలీఫ్ పండ్ కు పంపుతారా అనేది తెలియాలి.. అయితే ఆమె సొంత ప్రాంతం ఇలాంటి ప‌రిస్దితికి గురి అవ్వ‌డంతో ఆమె ఎంతో విచారించారు.. అక్క‌డ ఉన్న‌వారికుటుంబ యోగ‌క్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు.. అక్క‌డ త‌న‌కు తెలిసిన వారి ద్వారా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నార‌ట సుమ‌.. మొత్తానికి సుమ చేసిన ప‌నికి ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీ టాలీవుడ్ ప్రేక్ష‌కులు బుల్లితెర అభిమానులు ఆమెను అభినందిస్తున్నారు.